Viswak Sen : ఫంకీతో పాటు సీరియస్ పొలిటికల్ మూవీట

విశ్వక్ సేన్ 2025లో బిగ్గెస్ట్ డిజాస్టర్ అందుకున్నాడు. లైలా మూవీతో అతని ఖాతాలో దారుణమైన ఫ్లాపు పడింది. దీంతో కాస్త టైమ్ తీసుకున్నాడు. డిఫరెంట్ మూవీ చేయబోతున్నాడు అని భావించారు. బట్ అందులో నిజం లేదు. ఇంతకీ డిఫరెంట్ మూవీ అంటే.. ‘ఫంకీ’. అనుదీప్ డైరెక్షన్ లో రూపొందుతోన్న మూవీ ఇది. కయాడు లోహర్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీ టీజర్ విడుదలైంది. ఈ మూవీతో విశ్వక్ సేన్ మంచి విజయం అందుకోబోతున్నాడు అనిపించేలా ఉంది టీజర్. ఫిబ్రవరి 13న ఈ మూవీ విడుదల కాబోతోంది. అయితే ఈ మూవీతో పాటు సైలెంట్ గా మరో ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయబోతున్నాడు విశ్వక్ సేన్.
ఇంతకు ముందు ‘పిండం’అనే డిఫరెంట్ మూవీతో ఆకట్టుకున్న దర్శకుడు సాయికిరణ్ తో విశ్వక్ సేన్ మరో సినిమా చేస్తున్నాడు. అయితే ఇదో సీరియస్ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ అంటున్నారు. ఈ మూవీ టీజర్ ను కూడా జనవరి 1న విడుదల చేయబోతున్నారు అని ప్రకటించారు. ఈ ప్రకటనకు ముందు కూడా కనీసం విశ్వక్ సేన్ ఈ మూవీ చేస్తున్నాడు అని చెప్పలేదు. చాలా సైలెంట్ గా ఈ మూవీని రూపొందించబోతున్నారు. ఈ మూవీ టీజర్ ను జనవరి 1న సాయంత్రం 5 గంటలకు విడుదల చేయబోతున్నట్టు చెప్పారు.మరి ఈ సీరియస్ పొలిటికల్ మూవీతో విశ్వక్ సేన్ మళ్లీ ఫామ్ లోకి వస్తాడా అనేది చూడాలి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

