Viswak Sen Laila : లైలాకు లైన్ క్లియర్ అయినట్టేనా

Viswak Sen Laila :  లైలాకు లైన్ క్లియర్ అయినట్టేనా
X

విశ్వక్ సేన్, ఆకాంక్ష శర్మ జంటగా నటించిన సినిమా లైలా. ఈ నెల 14న విడుదల కాబోతోంది. రామ్ నారాయణ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీని సాహు గారపాటి నిర్మించాడు. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అనుకోకుండా జరిగిన ఓ పొరబాటు వల్ల సినిమాకు పెద్ద సమస్యలే వస్తాయని భావించారు. నటుడు పృథ్వీరాజ్ చేసిన పొలిటికల్ కమెంట్స్ వల్ల వైసీపీ వాళ్లు బాయ్ కాట్ లైలా అంటూ హ్యాష్ ట్యాగ్ తో ట్రెండ్ చేశారు. కొందరైతే మొదటి ఆటకే హచ్.డి ప్రింట్ తో ఆన్ లైన్ లో లీక్ చేస్తాం అని బెదిరించారు కూడా. దీనికి హీరో, నిర్మాత కలిసి సారీ చెబుతూ ఓ ప్రెస్ మీట్ కూడా పెట్టారు. తర్వాత వైసీపీ శ్రేణులు కాస్త శాంతించినట్టు కనిపించినా.. పృథ్వీరాజ్ మళ్లీ రెచ్చగొట్టేలా మాట్లాడాడు. అతనూ బూతులు తిట్టాడు. దీంతో మళ్లీ లైలాకు సమస్యలు తప్పేలా లేవు అనుకుంటున్నారు. బట్ గ్రౌండ్ లెవల్ లో మరీ అంత ఇబ్బందులేం ఉండకోవచ్చు అనేది కొందరి భావన. నిజానికి ఇలాంటి సందర్భాల్లో గ్రౌండ్ లెవల్లో సమస్యలు ఉన్నా ఇబ్బంది లేదు. బట్ ఆన్ లైన్ లోనే వచ్చింది అసలు తంటా. అది తప్పించుకోవడం అంత సులువేం కాదు. అసలే పెద్ద పెద్ద సినిమాలకే పైరసీ నుంచి రక్షణ లేదు. ఇక లైలా ఎంత..? అందుకే లైలాకు లైన్ పూర్తిగా క్లియర్ అయింది అనుకోవడానికి కూడా లేదు.

ఇక సినిమా విషయానికి వస్తే.. విశ్వక్ సేన్ పూర్తిగా లేడీ గెటప్ తో నటించాడు. టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓ కంప్లీట్ ఎంటర్టైనర్ ను చూడబోతున్నాం అనే ఫీల్ కలుగుతుంది. కాకపోతే అక్కడక్కడా కాస్త అడల్ట్ డైలాగులు బాగానే పడ్డాయి. అందుకే లేటెస్ట్ సెన్సార్ నుంచి ఈ చిత్రానికి ‘ఏ’సర్టిఫికెట్ వచ్చింది. అంటే పెద్దలకు మాత్రమే అన్నమాట. ఏదేమైనా లైలాతో మంచి హిట్ కొట్టబోతున్నాడు అనే ఫీల్ వచ్చిన టైమ్ లో అనుకోని పంచాయితీ విశ్వక్ సేన్ కు పెద్ద తలనొప్పిగా మారిందనే చెప్పాలి.

Tags

Next Story