Viswak Sen : లైలాకు అక్కడా పరాభవమే

విశ్వక్ సేన్, ఆకాంక్ష శర్మ జంటగా రామ్ నారాయణ్ తెరకెక్కించిన సినిమా లైలా. గత నెల 14న వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదలైన ఈ చిత్రానికి యూనానిమస్ గా డిజాస్టర్ టాక్ వచ్చింది. ముఖ్యంగా కంటెంట్ పై చాలా విమర్శలు వచ్చాయి. విశ్వక్ సేన్ ఎంచుకున్న కథ చాలా నాసిరకంగా ఉందని కామెంట్స్ చేశారు. ఈ తరహా కథలతో అతను హీరోగా రాణించడం అటుంచితే.. ఇప్పుడున్న ఇమేజ్ కూడా పోతుందని హెచ్చరించారు. డబుల్ మీనింగ్ డైలాగ్స్ లో జబర్దస్త్ నే మించి పోయిన సినిమా అన్నారు. కొన్ని పాత్రలు ఎందుకు ఉన్నాయో కూడా అర్థం కాలేదు. మ్యూజికల్ గానూ ఏ ఇంపాక్ట్ కనిపించలేదు. ఫైనల్ గా ఓ చవకబారు సినిమాగా తేల్చారు ప్రేక్షకులు.
ఈ సినిమా రిజల్ట్ ను స్వీకరిస్తున్నానని.. ప్రేక్షకులను, ఫ్యాన్స్ ను ఇబ్బంది పెట్టానని తర్వాత ఓపెన్ లెటర్ కూడా పెట్టాడు విశ్వక్ సేన్. ఇక ఈ నెల 7 నుంచి ఓటిటిలో స్ట్రీమ్ అవుతోన్న లైలాకు ఇక్కడా పరాభవం తప్పలేదు. థియేటర్స్ లో చూడకుండా కేవలం ఓటిటి లోనే చూసిన, చూస్తున్న ఆడియన్స్ సైతం విశ్వక్ సేన్ సెలెక్షన్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. నిజానికి ఇలాంటి సినిమాలు కొన్నిసార్లు ఓటిటిలో ఓకే అనిపించుకుంటాయి. బట్ లైలాకు ఆ అవకాశం కూడా లేకపోయింది. ఏదేమైనా ఆడియన్స్ ను తక్కువ అంచనా వేస్తూ సినిమాలు తీస్తే ఇలాంటి రిజల్ట్స్ తప్పవు అని లైలా మరోసారి నిరూపించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com