Viswak Sen : నవ్వులు పూయిస్తున్న విశ్వక్ సేన్ లైలా ట్రైలర్

విశ్వక్ సేన్, ఆకాంక్ష శర్మ జంటగా రామ్ నారాయన్ డైరెక్షన్ లో రూపొందిన సినిమా ‘లైలా’. ఆ మధ్య వచ్చిన టీజర్ చాలా ప్రామిసింగ్ అనిపించుకుంది. లేటెస్ట్ గా లైలా ట్రైలర్ ను విడుదల చేశారు. ఇది టీజర్ ను కంటిన్యూ చేస్తూన్నట్టుగానే.. సోనూ అనే మేకప్ ఆర్టిస్ట్ వల్ల ఆడవాళ్లంతా భర్తలను చులకన చేస్తుంటారు. దీంతో ఆ మగవాళ్లంతా అతనిపై తిరుగుబాటు చేస్తారు. ఏకంగా అతన్ని చంపేయాలని పోలీస్ లు, గూండాలు, ఓ బస్తీ వాసులు ప్రయత్నాలు చేస్తుంటారు. దీంతో తనే మేకప్ ఆర్టిస్ట్ కాబట్టి ఎవరికీ దొరక్కుండా లేడీ గెటప్ వేసుకుని.. లైలాగా పేరు మార్చుకుని వాళ్లముందే తిరుగుతుంటాడు సోనూ. లేడీ గెటప్ లో ఉన్న ఇతన్ని చూసి ఆ పోలీస్, గూండాతో పాటు చాలామంది మగవాళ్లు ప్రేమలో పడిపోతారు. మరి వారి నుంచి తప్పించుకునేందుకు ఎన్ని తంటాలు పడ్డాడు. ఈ లేడీ గెటప్ వల్ల తను ప్రేమించిన అమ్మాయితో ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశాడు అనే కోణంలో సాగే కథలా ఉంది. కాకపోతే ఇంతమంది అతని వెంట పడటానికి కారణం కేవలం మేకప్ మాత్రమే కాదు.. ఇంకేదో ఉండే ఉంటుంది అనిపించేలానూ ఉంది.
లైలా ట్రైలర్ మాత్రం అవుట్ అండ్ ఎంటర్టైనింగ్ గా ఉంది. పూర్తి వినోదాత్మక కథతో వస్తున్నట్టు కనిపిస్తోంది. లేడీ గెటప్ లో విశ్వక్ సేన్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. లైలా పాత్రకు సింగర్ శ్రావణ భార్గవి డబ్బింగ్ చెప్పినట్టుంది. కాకపోతే అక్కడక్కడా కొన్ని అడల్ట్ డైలాగ్స్ కూడా పడ్డాయి. ట్రైలర్ లో ఉన్నంత వరకేనా సినిమాలో ఇంకా చాలా ఉంటాయా అనేది చూడాలి. ముఖ్యంగా లేడీ గెటప్ లో ఉన్న తన వెంట పడుతున్న ఒకతను తనకు నాలుగో పెళ్లాంగా రమ్మంటాడు. దానికి ‘నాది లోపల ఉన్న మేటర్ నీకీ తెలిస్తే నీది గుండాగి చస్తయ్’అనే డైలాగ్ హిలేరియస్. నీకు పువ్వులేదు.. కాయా ఉన్నయ్, గజ్జలు పగులుతయ్ లాంటి డైలాగ్స్ కథనాన్ని బట్టి కవర్ అవుతాయోమో.. కానీ మొత్తంగా లైలా ట్రైలర్ మాత్రం ఆకట్టుకుంటోంది. ఈ నెల 14న ఈ చిత్రం విడుదల కాబోతోంది. మరి విశ్వక్ సేన్ అలియాస్ లైలా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com