Viswambhara : చిన్న సినిమాతో ఉలిక్కి పడిన విశ్వంభర

Viswambhara  :   చిన్న సినిమాతో ఉలిక్కి పడిన విశ్వంభర
X

పెద్ద సినిమాలు బరిలో ఉన్నాయంటే చిన్న సినిమాలు తప్పుకుంటాయి. ముఖ్యంగా సంక్రాంతి వంటి పెద్ద సీజన్స్ లో. బట్ ఓ చిన్న సినిమా సడెన్ గా అనేక అనుమానాలను పెంచింది. అందులో ముఖ్యంగా విశ్వంభర గురించే మాట్లాడుకునేలా చేశాయి. రీసెంట్ గా ఆగస్ట్ 15న పుష్ప 2 విడుదల అన్నారు. బట్ అదే టైమ్ కు పూరీ జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ ను అదే డేట్ కు వేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో అంతా పుష్ప 2 రావడం లేదు అని ఫిక్స్ అయ్యారు. ఆ వెంటనే ఆయ్, మిస్టర్ బచ్చన్ కూడా అనౌన్స్ కావడంతో పుష్ప 2 పోస్ట్ పోన్ అయిందని డిక్లేర్ అయ్యారంతా.

ఇప్పుడు సంక్రాంతి విషయంలో కూడా అదే కనిపించింది. ఇప్పటికే రవితేజ సంక్రాంతి బరి నుంచి తప్పుకున్నాడు. ఎప్పుడో జనవరి 10న విడుదల అని మెగాస్టార్ చిరంజీవి విశ్వంభరను ప్రకటించారు. అయితే లేటెస్ట్ గా సందీప్ కిషన్, త్రినాథరావు నక్కిన కాంబినేషన్ లో రూపొందుతోన్న మూవీని సంక్రాంతికి విడుదల చేస్తున్నాం అని ప్రకటించారు. దీంతో విశ్వంభర కూడా పోస్ట్ పోన్ అవుతుందని అంతా అనుమాన పడ్డారు. లేదంటే అంత పెద్ద హీరోల మధ్య మినిమం ఓపెనింగ్స్ కూడా తెచ్చుకోలేని హీరో పోటీ పడుతున్నాడు అంటే.. నమ్ముతారా.. అసలు అక్కడ పోటీయే లేదని భావించారు.

విశ్వంభర పోస్ట్ పోన్ అనే రూమర్ అటు డిస్ట్రిబ్యూటర్స్ లో కూడా కలవరం రేకెత్తించింది. కట్ దీంతో దర్శకుడు వశిష్ట రంగంలోకి దిగాడు. తమ సినిమా వాయిదా పడటం లేదని ‘విశ్వంభర.. విజృంభణ.. తథ్యం’.. అంటూ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఇదే విషయాన్ని డిస్ట్రిబ్యూటర్స్ కు కూడా క్లియర్ గా అర్థం అయ్యేలా చెప్పారట. మొత్తంగా సందీప్ కిషన్ సినిమా సంక్రాంతికి అనగానే విశ్వంభర మేకర్స్ ఉలిక్కి పడాల్సి వచ్చింది.

Tags

Next Story