రవితేజ నిర్మాతగా... వైవా హర్ష హీరోగా...
వైవా హర్ష ప్రధాన పాత్రలో సుందరం మాస్టార్ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాను మాస్ మహారాజ రవితేజ నిర్మిస్తున్నారు. సినిమా ఫస్ట్ లుక్ ను రవితేజ రిలీజ్ చేశారు. సుందరం మాస్టర్ అనే గవర్నమెంట్ టీచర్ మిర్యాల మెట్ట అనే మారుమూల పల్లెటూరుకు ఇంగ్లీష్ టీచర్ గా వెళ్తాడు. అక్కడి గిరిజనులకు సుందరం మాస్టర్ ఎలా చదువు చెప్పాడు అనే కథ ఆధారంగా సినిమా రూపుదిద్దుకుంది. కళ్యాణ్ సంతోష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హర్షకు జంటగా దివ్య శ్రీపాద నటించింది.
ఈ మూవీని సుధీర్ కుమార్ తోకలిసి రవితేజ నిర్మించారు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు నిర్మాతగా ఉన్నారు. గతంలో రావణాసుర, మట్టికుస్తీ, చాంగురే బంగారు రాజా వంటి సినిమాలకు రవితేజ నిర్మాతగా వ్యవహరించారు. ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు, ఈగల్ చిత్రాల్లో బిజీగా గడుపుతున్నారు రవితేజ. నాగేశ్వరరావులో గజదొంగ కథాంశంతో తెరకెక్కుతుంటే, ఈగల్ సినిమా స్పై యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతోంది.
సుందరం మాస్టర్ సినిమాలో గిరిజనులకు చదువు చెప్పే కథ 1930 కాలంలో కాకుండా 2023 లోనే జరిగినట్లు పోస్టర్ ద్వారా స్పష్టం చేశారు. అయితే ఆ బ్యాచ్ లో చిన్న పిల్లలే కాకుండా గిరిజన పెద్దలు ఉంటారు. ఈ విషయంతో అసలు సినిమా కథ ఎలా ఉండబోతుందోనని సినీప్రేమికులు ఇంట్రస్ట్ చేపిస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com