VJ Sunny Remuneration: రెమ్యునరేషన్‌తో పాటు సన్నీ గెలుచుకున్నవి ఇవే..

VJ Sunny (tv5news.in)

VJ Sunny (tv5news.in)

VJ Sunny Remuneration: బిగ్ బాస్ సీజన్ 5కు విన్నర్‌గా నిలిచాడు సన్నీ.

VJ Sunny Remuneration: బిగ్ బాస్ తెలుగు సీజన్ 5కు విన్నర్‌గా నిలిచాడు సన్నీ. బిగ్ బాస్ హౌస్‌లో తన జర్నీ ఎంతోమందిని ఇన్‌స్పైర్ చేసేలాగా అనిపిస్తుంది. ఈసారి బిగ్ బాస్‌లోకి 19 మంది కంటెస్టెంట్స్‌లో చాలామంది ప్రేక్షకులకు అంతగా సుపరిచితులు కాదు. అందులో సన్నీ కూడా ఒకడు. జర్నలిస్ట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించినా.. ఆ తర్వాత వీజేగా, సీరియల్ యాక్టర్‌గా ఎదిగాడు. అలాంటి సన్నీ బిగ్ బాస్ వల్ల చాలామంది ప్రేక్షకులను, ఫైనాన్షియల్ సపోర్ట్‌ను అందుకున్నాడు.

ఒకేసారి 19 మంది కంటెస్టెంట్స్‌ హౌస్‌లోకి వెళ్లిసరికి వారి స్వభావాలు ఏంటో తెలుసుకోవడానికి వారిలో వారికి మాత్రమే కాదు.. ప్రేక్షకులకు కూడా సమయం పట్టింది. అలా సన్నీపై ప్రేక్షకులకు పెద్దగా అభిప్రాయం ఏమీ ఏర్పడలేదు. కానీ హౌస్‌లో మనుషులు తగ్గిపోతున్నాకొద్దీ సన్నీ ఎంతగా ఎంటర్‌టైన్ చేయగలడో ప్రేక్షకులకు అర్థమయ్యింది.

టాస్క్‌ల విషయంలో కూడా సన్నీ ఎప్పుడూ, ఏ కారణం వల్ల కూడా వెనక్కి తగ్గలేదు. చాలాసార్లు తన తోటి కంటెస్టెంట్సే తనపై నెగిటివ్ అభిప్రాయాన్ని ఏర్పరచడానికి ప్రయత్నించినా సన్నీ మాత్రం స్ట్రాంగ్‌గా ఉండి అందరి మనసులను గెలుచుకున్నాడు. దాంతో పాటు బిగ్ బాస్ విన్నర్ క్యాష్ ప్రైజ్ రూ. 50 లక్షలతో పాలు సిటీలో ఓ ఫ్లాట్ కూడా సొంతం చేసుకున్నాడు.

అయితే ఇన్నిరోజులు హౌస్‌లో ఉన్నందుకు రెమ్యునరేషన్‌గా సన్నీకి రూ. 30 లక్షలు అందనున్నట్టు సమాచారం. దీంతో పాటు ఓ స్పోర్ట్ బైక్‌ను కూడా తాను సొంతం చేసుకోనున్నాడు. మొత్తానికి ఓ సాధారణ హౌస్‌మేట్‌గా బిగ్ బాస్‌లోకి అడుగుపెట్టిన సన్నీ.. ప్రస్తుతం పెద్ద స్టార్ అయిపోయాడు. తాను బయటికి రాగానే చాలామంది ఫ్యాన్స్ తనకు వెల్‌కమ్ చెప్తూ ర్యాలీ కూడా నిర్వహించారు.

Tags

Next Story