Bigg Boss 5 Telugu Winner: బిగ్ బాస్ విన్నర్‌గా సన్నీ.. వెల్‌కమ్ ర్యాలీలో ఉద్రిక్తత..
vj sunny (tv5news.in)
Bigg Boss 5 Telugu Winner: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ విన్నర్‌గా సన్నీ నిలిచాడు. 105 రోజుల పాటు సాగిన బిగ్‌బాస్-5లో మొత్తం 19మంది కంటెస్టెంట్‌లు పాల్గొనగా.. తనదైన ఆట తీరుతో మెప్పించి, ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు సన్నీ. ఉత్కంఠగా సాగిన ఫినాలేలో మొదట సిరి, మానస్, శ్రీరామచంద్ర ఎలిమినేట్ అవ్వగా.. చివరకు సన్నీ, షణ్ముఖ్ నిలిచారు.
ఉత్కంఠగా సాగిన కౌంట్‌డౌన్‌లో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుని అత్యధిక ఓట్లు సంపాదించిన వీజే సన్నీ.. విజేతగా నిలిచినట్లు ప్రకటించారు. సన్నీకి కింగ్ నాగార్జున బిగ్‌బాస్ ట్రోఫీని బహుకరించాడు. అంతేకాక 50 లక్షల చెక్‌ను అందజేశాడు. దీనితో పాటు సువర్ణ భూమి ఇన్‌ఫ్రాస్టక్చర్ నుంచి షాద్‌నగర్‌లో 25 లక్షల విలువ చేసే 300 చదరపు గజాల భూమిని విన్నర్ సన్నీ సొంతం చేసుకున్నట్లు ప్రకటించాడు. టీవీఎస్ బైక్ కూడా గెలుచుకున్నారని నాగార్జున అన్నారు.
ఇక బిగ్ బాస్ విన్నర్ సన్నీకి అభిమానులు ఘనస్వాగతం పలికారు. హౌస్ నుంచి బయటిరాగానే అతనిపై పూల వర్షం కురిపించారు. తరువాత అతని ఇంటి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. దారిపొడవున నానాహంగామా చేశారు. ఆ సమయంలో ర్యాలీలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు జోక్యంతో ర్యాలీ ప్రశాంతంగా ముగిసింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com