Matka: 1960 బ్యాక్ డ్రాప్ లో స్టోరీ

Matka: 1960 బ్యాక్ డ్రాప్ లో స్టోరీ
వరుణ్ తేజ్ కొత్త సినిమా.. పూజా కార్యక్రమంలో టైటిల్ రివీల్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. పలాస ఫేమ్ దర్శకుడు కరుణ కుమార్‌తో కలిసి తన నెక్స్ట్ సినిమాను ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు ముందుగా VT14 అనే పేరు పెట్టగా.. తాజాగా 'మట్కా' అనే టైటిల్ ను ఖరారు చేశారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ సినిమాను మేకర్స్ పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. హైదరాబాద్ లో జరిగిన చిత్ర ప్రారంభోత్సవంలో, నిర్మాత సురేష్ బాబు, దర్శకుడికి స్క్రిప్ట్‌ను లాంఛనంగా అందజేయగా, మారుతి మొదటి షాట్‌కు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అల్లు అరవింద్ క్లాప్‌బోర్డ్‌ను వినిపించారు. హరీష్ శంకర్ టైటిల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా ఏకకాలంలో విడుదల కానున్నట్టు ఈ సందర్భంగా వెల్లడించారు. కాగా మట్కా త్వరలోనే సెట్స్‌పైకి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

ఈ సినిమా వరుణ్ తేజ్ కెరీర్‌లోనే అత్యంత ఖరీదైన సినిమాగా ఇది నిలుస్తుందని టాక్ వినిపిస్తోంది. అత్యంత ఆసక్తికరమైన వార్త ఏమిటంటే, ఈ చిత్రంలో బాలీవుడ్ నటి నోరా ఫతేహి ఓ కీలక పాత్రలో నటించనుంది. బాలీవుడ్‌కు చెందిన ఈ డ్యాన్సర్ మట్కాలో ఒక ప్రధాన పాత్రను పోషించనుంది.

వరుణ్ తేజ్ కెరీర్ లో 14వ చిత్రంగా తెరకక్కుతోన్న ఈ సినిమాను వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి నిర్మించనున్నారు. అంతే కాదు ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించనుంది. ఇక మరో హీరోయిన్ గా నోరా ఫతేహి నటించనుంది. స్పెషల్ సాంగ్స్ తో పాపులరైన ఈ భామ, ఈ సినిమాలో కూడా ఓ స్పెషల్ సాంగ్ చేస్తూనే, కీలక పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. ఇక సినిమా కథ విషయానికొస్తే.. ఈ మూవీ 1960 బ్యాక్ డ్రాప్ లో రాబోతోంది. సినిమా మొత్తం వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో నడుస్తుందని తెలుస్తోంది.

బాలీవుడ్ సినిమాల్లో నెంబర్ వన్ డ్యాన్సర్ గా పేరు తెచ్చుకున్న నోరా ఫతేహి వరుణ్ తేజ్ లో ఈ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది, దీంతో ఆమె ఈ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అరంగేట్రం కానుంది. ఆమె VT14లో కీలక పాత్రలో నటించడం ద్వారా వరుణ్ తేజ్‌తో కలిసి స్క్రీన్‌ను పంచుకోనుంది. మరో ఆసక్తికరమైన వార్త ఏమిటంటే, ఆమె కేవలం పాత్రలో మాత్రమే కాకుండా ఈ చిత్రంలో ఒక ప్రత్యేక సాంగ్ లో కనిపించనుందట. భారీ అంచనాలున్న ఈ చిత్రంలో ఆమె తెలుగు నటుడితో కలిసి కాలు కదపనుందన్నమాట.


Tags

Read MoreRead Less
Next Story