VV Vinayak: పూరీ ఒక యోగి.. 'లైగర్' గురించి ఆలోచించట్లేదు : వివి వినాయక్

VV Vinayak:  పూరీ ఒక యోగి.. లైగర్ గురించి ఆలోచించట్లేదు : వివి వినాయక్
VV Vinayak: రాత్రికి రాత్రే రాతలు మారిపోయేది ఒక్క సినిమా ఇండస్ట్రీలోనే అయి ఉంటుంది. సినిమా అంటే కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టే వ్యాపారం.

VV Vinayak: రాత్రికి రాత్రే రాతలు మారిపోయేది ఒక్క సినిమా ఇండస్ట్రీలోనే అయి ఉంటుంది. సినిమా అంటే కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టే వ్యాపారం. ఎత్తుపల్లాలు, ఒడిదుడుకులు సహజం. అప్పటి వరకు హిట్లిచ్చి ఒక్క ప్లాపు వస్తే పనైపోయిందంటారు. హిట్ వస్తే ఆకాశానికి ఎత్తేస్తారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న పూరీకి కూడా ఈ అపవాదు తప్పట్లేదు.

తాజాగా తాను తీసిన లైగర్ అట్టర్ ప్లాప్ అవడంతో పూరీని ఓ రేంజ్‌లో విమర్శిస్తున్నారు నెటిజన్లు. సినిమా ప్లాప్‌తో పూరీ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడని రూమర్లు వస్తున్నాయి. అయితే వీటిపై స్పందించిన దర్శకుడు వివి వినాయక్.. గతంలోనూ పూరీ ఎన్నో ఎత్తు పల్లాలు చూశాడు. పోకిరీతో సూపర్ హిట్ అందుకున్నాడు. అతడి సామర్ధ్యం ఏమిటో ఆయన సన్నిహితులకు మాత్రమే తెలుసు.

కొంత మంది తమ ఆనందం కోసం ఇలాంటి వార్తలు సృష్టిస్తారు. కానీ పూరీ అంత అసమర్ధుడు కాదు. సినిమా అన్నాక ఆర్థికపరమైన ఇబ్బందులు సహజం. దానికి అతడు ముందే సిద్ధంగా ఉంటాడు. లైగర్ వల్ల ఎంత పోయింది. ఎంత వచ్చింది అన్న విషయం అతడికే తెలుసు. పోగొట్టుకున్న దాన్ని తిరిగి సంపాదించుకోలేనంత తెలివి తక్కువ వాడు కాదు. మరో సినిమాతో హిట్ కొట్టగల సామర్థ్యం అతడికి ఉంది అని వినాయక్ అన్నారు.

ఒక సినిమా ప్లాప్ అయితే దాని గురించే ఆలోచిస్తూ కూర్చునే మనస్థత్వం కాదు పూరిదీ. అతడు ఒక యోగి. గతంలో ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావుకు కూడా ఈ పరిస్థితి ఎదురైంది. ఎన్నో హిట్ చిత్రాలు అందించిన ఆయన ఒక్కసారిగా కిందకు వచ్చేశారు. అయినా నిరుత్సాహ పడక ముందుకు వెళ్లారు. మరిన్ని మంచి చిత్రాలు తీసి హిట్ అందుకున్నారు. ఇండస్ట్రీలో ఇలాంటివి సహజం. లేకపోతే ఇక్కడ మనుగడ సాగించడం అసాధ్యం అని వినాయక్ వివరించారు.

అనంతరం అదుర్స్ 2పై స్పందిస్తూ.. తారక్‌తో పాటు నాక్కూడా కెరీర్‌లో మంచి పేరు తెచ్చిన చిత్రం అదుర్స్. దాన్ని టచ్ చేయకుండా ఉంటేనే మంచిది అని వినాయక్ తెలిపారు

Tags

Read MoreRead Less
Next Story