VV Vinayak: వినాయక్ సినిమాల్లో పక్కా అవి ఉండాల్సిందే.. అదే తన సెంటిమెంట్..

VV Vinayak (tv5news.in)

VV Vinayak (tv5news.in)

VV Vinayak: తన సినిమాలతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోగల వివి వినాయక్ పుట్టినరోజు నేడు.

VV Vinayak: హీరో కారు వెనుక మరో పది కార్లు ఉండాలి.. హీరో ఎలివేషన్ సీన్లకు ఏ మాత్రం కొదవ ఉండకూడదు.. కమెడియన్ కామెడీకి థియేటర్‌లో జనాలంతా పడి పడి నవ్వాలి.. ఇవే ఒక సినిమా తీసే ముందు దర్శకుడు వివి వినాయక్ ముఖ్యంగా చూసుకునే అంశాలు. తన సినిమాలతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోగల వివి వినాయక్ పుట్టినరోజు నేడు. తన బర్త్‌డే సందర్భంగా వినాయక్ కెరీర్‌కు ఓ చిన్న రివైండ్..

సినిమా పరిశ్రమలో పనిచేసే ఒక్కొకరికి ఒక్కొక్క సెంటిమెంట్ ఉంటుంది. అలాగే వినాయక్ కెరీర్ కూడా దాదాపు అలాంటి సెంటిమెంట్‌లపైనే నడుస్తుంది. మాస్ ప్రేక్షకులను పూర్తిస్థాయిలో ఎంటర్‌‌టైన్ చేసే దర్శకులు ఈకాలంలో చాలా తక్కువమందే ఉన్నారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పేరు వివి వినాయక్. మాస్ ప్రేక్షకులు ఇష్టపడే కమర్షియల్ ఎలిమెంట్స్ అన్ని తన సినిమాలో పెడుతూ.. అవి లేకుండా సినిమాలు తీయలేనంతగా వాటిని సెంటిమెంట్‌గా మార్చేసుకున్నారు వినాయక్.



వినాయక్ సినిమాల్లో యాక్షన్ కూడా మాస్ మూవీ లవర్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటుంది. యాక్షన్ అనగానే మనకు ముందుగా గుర్తిచ్చేది ఛేజింగ్ సీన్స్. అలాంటి ఛేజింగ్ సీన్స్ వినాయక్ సినిమాల్లో తప్పకుండా ఉంటాయి. ప్రతీ ఫైట్ ముందు ఛేజింగ్ సీన్ పెట్టడం వినాయక్‌కు సెంటిమెంట్. పైగా ఆ సీన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోగలడు కూడా.


వి వి వినాయక్ సినిమాల్లో మనం చూసే మరో కామన్ పాయింట్ డ్యూయల్ రోల్. హీరో లేదా విలన్ ఎవరో ఒకరు వినాయక్ సినిమాల్లో డ్యూయల్ రోల్‌లో కనిపించాల్సిందే. అలా అయితేనే సినిమా హిట్ అవుతుంది అని ఆయన సెంటిమెంట్. అదుర్స్ నుండి అల్లుడు శ్రీను వరకు వినాయక్ తీసిన దాదాపు అన్ని సినిమాల్లో మనకు ఈ డ్యూయల్ రోల్స్ కనిపిస్తాయి.

హీరో క్యారెక్టరైషన్‌ను రఫ్ అండ్ టఫ్‌గా చూపించే వినాయక్.. ఆ హీరో ఎందుకలా అయ్యాడో చూపించడానికి కచ్చితంగా ఒక ఫ్యాష్‌బ్యాక్ ఎపిసోడ్‌ను ప్లాన్ చేస్తాడు. వినాయక్ దర్శకత్వం వహించిన 14 సినిమాల్లోని 12 సినిమాల్లో ఈ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్ మనకు ఎదురవుతాయి. పైగా ఈ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్లలో కచ్చితంగా ఓ కీలక పాత్ర చచ్చిపోవాల్సిందే. అప్పుడు హీరో క్యారెక్టరైజేషన్ మరింత స్ట్రాంగ్‌గా ఉంటుందని వినాయక్ నమ్మకం.


మామూలుగా కమెడియన్ క్యారెక్టర్లను చాలా డిఫరెంట్‌గా డిజైన్ చేస్తారు వినాయక్. కమెడియన్ అనేవాడు హీరో పక్కన ఉండి ప్రేక్షకులను నవ్విస్తాడు. కానీ వినాయక్ సినిమాల్లో కమెడియన్ ఎప్పుడూ విలన్ పక్కనే ఉంటాడు. విలన్‌ను భయపెడుతూ.. హీరోను ఎలివేట్ చేస్తూ.. ప్రేక్షకులను నవ్వించే క్యారెక్టర్ అది.


ఏ సినిమాలో అయినా హీరో, హీరోయిన్ ఎలా కలుసుకుంటారు అనే అంశం కీలక పాత్ర పోషిస్తుంది. అసలు వారు ఎలా కలుసుకుంటారు, ఎలా ప్రేమలో పడతారు అనే విషయాలను ఆసక్తిగా చూసే ప్రేక్షకులు ఉంటారు. అయితే వినాయక్ సినిమాల్లో హీరో, హీరోయిన్ ఎప్పుడూ గొడవలతోనే పరిచయమవుతారు. ఆ గొడవలే వారిని దగ్గర చేస్తాయి. ఏదో ఒక కీలక సన్నివేశంలో హీరోయిన్.. హీరోను ప్రేమించడం మొదలుపెడుతుంది.

ఏ సెంటిమెంట్‌ను ఫాలో అయినా కూడా.. ఇప్పటికీ వినాయక్ సినిమాలకు ఉన్న క్రేజే వేరు. దర్శకుడిగా కాస్త వెనకబడిన వినాయక్.. త్వరలోనే మనల్ని హీరోగా మెప్పించడానికి సిద్ధమవుతున్నాడు. డైరెక్టర్‌గా హీరోలతో ఎన్నో క్యారెక్టర్స్‌ను చేయించిన ఆయన స్వయంగా స్క్రీన్ మీద హీరోగా కనిపించే రోజు దగ్గర్లోనే ఉంది.



Tags

Read MoreRead Less
Next Story