VV Vinayak: బాలయ్యకు చెల్లెలిగా చేయమంటే ఏడ్చేసిన నటి..

VV Vinayak: బాలయ్యకు చెల్లెలిగా చేయమంటే ఏడ్చేసిన నటి..
VV Vinayak: హీరోయిన్‌గా చేస్తున్నప్పుడే చెల్లెలు, అక్కలాంటి పాత్రలు చేయమంటే అందరు హీరోయిన్లు అందుకు ఒప్పుకోరు.. నిజానికి ఇలాంటి పాత్రలకు నటులను సెలెక్ట్ చేయడం చాలా కష్టం అంటారు దర్శకులు..

VV Vinayak: హీరోయిన్‌గా చేస్తున్నప్పుడే చెల్లెలు, అక్కలాంటి పాత్రలు చేయమంటే అందరు హీరోయిన్లు అందుకు ఒప్పుకోరు.. నిజానికి ఇలాంటి పాత్రలకు నటులను సెలెక్ట్ చేయడం చాలా కష్టం అంటారు దర్శకులు.. బాలకృష్ణతో సమరసింహారెడ్డి చిత్రాన్ని తీస్తున్నప్పుడు తనకు ఎదురైన అనుభవాన్ని పంచుకున్నారు దర్శకుడు వీవీ వినాయక్.

హీరో యిజానికి ఫ్యాక్షనిజం జోడిస్తూ ఆయన తీసిని సినిమాలు సూపర్ డూపర్ హిట్ అందుకున్నాయి. తొలి సినిమా ఆదితో హిట్ కొట్టి, ఆ వెంటనే సమరసింహారెడ్డి తీసి మరో హిట్ అందుకున్నారు. ఇందులో కథానాయిక పాత్ర కోసం టబు కంటే ముందు సౌందర్యను సంప్రదించారు వినాయక్.. అయితే ఆమె ఓల్డ్ పాత్రలు చేయనని చెప్పారు.

దాంతో టబుని సంప్రదించాల్సి వచ్చింది. అలాగే హీరో చెల్లెలి పాత్ర కోసం లయను అడగ్గా ఆమె కూడా రిజెక్ట్ చేసింది. ఎందుకు సార్ చెల్లెలి పాత్రలు ఇస్తారు.. హీరోయిన్‌గా తెలుగు వాళ్లు పనికిరారా అని అడిగి కన్నీళ్లు పెట్టుకుంది. దాంతో మీ ముఖం అమాయకత్వంగా ఉంటుంది.

అందుకే ఈ రోల్ కోసం అడిగాను అని చెప్పాను. కానీ ఆమె ఒప్పుకోలేదు.. దాంతో సారీ చెప్పి వచ్చేశా. తర్వాత చెల్లెలి పాత్ర కోసం దేవయానిని అడిగితే ఆమె వెంటనే ఒప్పుకుంది. సినిమాలో తల్లి, చెల్లెలి పాత్రలు కోసం నటీ నటులను సెలెక్ట్ చేసుకోవడం చాలా కష్టం అని చెప్పుకొచ్చారు వినాయక్.

Tags

Read MoreRead Less
Next Story