Waltair Veerayya: వాల్తేరు వీరయ్య వయసెంతో కనిపెట్టలేమయ్య.. చిరు లుక్స్‌కి ఫ్యాన్స్ ఫిదా

Waltair Veerayya: తెలుగు వారికి సంక్రాంతి ఎంతో ఇష్టమైన పండుగ. చాలా సినిమాలు ముఖ్యంగా స్టార్ హీరోలు సంక్రాంతిని బేస్ చేసుకుని సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తుంటారు. కొత్త అల్లుళ్లతో పండుగ రోజు అత్తారిల్లు కళకళలాడుతుంది. అదే మాదిరిగా ఇండస్ట్రీలో కూడా సంక్రాంతి సందడి కనిపిస్తుంది.
ఈసారి సంక్రాంతికి వాల్తేరు వీరయ్య వచ్చేస్తున్నానని ముందుగానే అనౌన్స్ చేశాడు. ఈ సందర్భంగా ఈ రోజు చిరంజీవి కొత్త లుక్‌ను విడుదల చేశారు మేకర్స్. చుట్టూ గన్స్.. మధ్యలో స్టైల్‌గా గాగుల్స్ పెట్టుకుని కనిపిస్తున్న చిరుని చూసి మెగా ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమేనని, ఇందుకు సంబంధించిన ఎపిసోడ్ మొత్తం థియేటర్లలో పూనకాలు తెప్పిస్తుందని డైరెక్టర్ బాబీ ట్వీట్ చేశారు.
ముఠామేస్త్రి తరహాలో చిరు పూర్తి స్థాయి మాస్ పాత్రలో నటిస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు మొదలయ్యాయి. ఇంకా ఈ చిత్రంలో మాస్ మహరాజ రవితేజ ఓ కీలక పాత్రలో నటిస్తుండడం విశేషం. ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా శృతి హాసన్ నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. వాల్తేర్ వీరయ్య 2023 జనవరి 13న రిలీజ్ కానుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com