waltair veerayya: వాల్తేర్ వీరయ్య టైటిల్ సాంగ్.. ఫ్యాన్స్‌ ఫుల్ జోష్

waltair veerayya: వాల్తేర్ వీరయ్య టైటిల్ సాంగ్.. ఫ్యాన్స్‌ ఫుల్ జోష్
X
waltair veerayya: ఆరుపదులు దాటినా ఆయనలో జోష్ తగ్గలేదు. చిరంజీవి సినిమా వస్తోందంటే అంతే ఆసక్తిగా ఎదురు చూసే ఆడియన్స్ ఉన్నారు.

waltair veerayya: ఆరుపదులు దాటినా ఆయనలో జోష్ తగ్గలేదు. చిరంజీవి సినిమా వస్తోందంటే అంతే ఆసక్తిగా ఎదురు చూసే ఆడియన్స్ ఉన్నారు. అదే చిరు చేత వరుస సినిమాలు చేయిస్తోంది. సంక్రాంతికి వస్తున్న వాల్తేరు వీరయ్య సందడి అప్పుడే మొదలైనట్లు కనిపిస్తోంది. తాజాగా చిత్ర యూనిట్ టైటిల్ సాంగ్ విడుదల చేసింది.



మెగాస్టార్ చిరంజీవి నుంచి ఓ సినిమా వస్తోందంటే ఆ స్వాగ్ ఎలా ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. మామూలుగా చిరంజీవి సినిమా అంటేనే పాటలు ఫైట్లు కదా..? ఆయన లేటెస్ట్ మూవీ వాల్తేర్ వీరయ్య నుంచి లేటెస్ట్ గా మరో సాంగ్ విడుదల చేశారు. దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ పాటను చూస్తే పాట, ఫైట్ మిక్స్ అయినట్టుగా డబుల్ డోస్ అనేలా కనిపిస్తోంది.



అన్నిటికంటే ముఖ్యంగా వీరయ్య అనే టైటిల్ సాంగ్ లా కనిపిస్తోన్న ఈ పాటతో బాస్ ఫ్యాన్స్ కు నెక్ట్స్ లెవెల్ జోష్‌ ను ఇవ్వబోతున్నాడని అర్థం అవుతోంది. ఇక ఇలాంటి పాటలు రాయడంలో అందె వేసిన పెన్ను అనిపించుకున్న చంద్రబోస్ మరోసారి తనకే సొంతమైన పదవిన్యాసాలతో రెచ్చిపోయాడు.

Tags

Next Story