War 2 Censor : వార్ 2 సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ ఎంతంటే..

ఎన్టీఆర్, హృతిక్ రోషన్ హీరోలుగా నటించిన సినిమా వార్ 2 సెన్సార్ పూర్తి చేసుకుంది. అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ సినిమా యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ లోని స్పై మూవీస్ అన్నిటికంటే ఎక్కువ రన్ టైమ్ తో రూపొందడం విశేషం. ఇప్పటి వరకూ యశ్ రాజ్ ఫిల్మ్స్ లో వచ్చిన మూవీస్ కంటే వార్ 2 నిడివి ఎక్కువగా ఉంది. ఇక కియారా అద్వానీ.. హృతిక్ రోషన్ కు జోడీగా నటిస్తోంది. అవుట్అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన వార్ 2 ట్రైలర్ కు దేశవ్యాప్తంగా మంచి స్పందన వచ్చింది. ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ మూవీ కావడంతో ఇక్కడి ఆయన ఫ్యాన్స్ కూడా ఈ మూవీ కోసం ఈగర్ గా చూస్తున్నారు. ఈ తరహా కథలో నటించడం ఎన్టీఆర్ కూ ఇదే ఫస్ట్ టైమ్.
ఇక ఈ నెల 14న విడుదల కాబోతోన్న వార్ 2 సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ నుంచి ఈ చిత్రానికి ‘యూ/ఏ’ సర్టిఫికెట్ వచ్చింది. ట్రైలర్ లో చూస్తే ఓ రేంజ్ లో యాక్షన్ ఉంది. అయినా యూ/ ఏ అంటే ఆశ్చర్యమే. సినిమా నిడివి 2 గంటల 53 నిమిషాలు(173 నిమిషాలు) గా వచ్చింది. ప్రమోషన్స్ పరంగా చూస్తే నిర్మాణ సంస్థ నుంచి ఆశించినంత దూకుడు కనిపించడం లేదు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోని ఫ్యాన్స్ మాత్రం సందడి చేయడం మొదలుపెట్టారు. ప్రొడక్షన్ హౌస్ నుంచి సరైన ప్లానింగ్ అయితే కనిపించడం లేదు. ఈ మేరకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా డిజప్పాయింట్ అవుతున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com