War 2 First day Collections : డిజప్పాయింట్ చేసిన వార్ 2 కలెక్షన్స్

War 2 First day Collections :  డిజప్పాయింట్ చేసిన వార్ 2 కలెక్షన్స్
X

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన వార్ 2 ఓపెనింగ్ డే కలెక్షన్స్ విషయంలో నిరాశపరిచింది. అయినా అందులోనూ ఓ ఆనందం ఏంటంటే.. వచ్చిన కలెక్షన్స్ లో మేజర్ పర్సెంట్ తెలుగు స్టేట్స్ నుంచి, తెలుగు వారి నుంచే ఉంది. అంటే ఈ వసూళ్లు కూడా ఎన్టీఆర్ ను చూసి, ఎన్టీఆర్ కోసమే వచ్చాయి అని తేలిపోయింది. కాకపోతే అతని ఆర్ఆర్ఆర్, దేవర చిత్రాలు మొదటి రోజు వంద కోట్ల మార్క్ ను దాటాయి. బట్ ఈ వార్ 2 ఆ మార్క్ ను కూడా చేరుకోలేకపోయింది. యస్.. వార్ 2 మొదటి రోజు కేవలం 82 కోట్లు మాత్రమే సాధించింది. ఓ రకంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను ఇది బాగా డిజప్పాయింట్ చేయొచ్చు. అయినా అదే నిజం అంటోంది ట్రేడ్.

వార్ 2 కు బాలీవుడ్ నుంచి తీవ్రమైన నిరాశ ఎదురైంది. ఓ రకంగా ఈ చిత్రాన్ని వాళ్లు తిరస్కరించారు అనే చెప్పాలి. ఆ మధ్య వచ్చిన కొత్త కుర్రాళ్ల సయారే కంటే చాలా తక్కువ వసూళ్లు సాధించిందీ మూవీ. హిందీ బెల్ట్ నుంచి కేవలం 28 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. తెలుగు స్టేట్స్ నుంచి 50 కోట్ల వరకూ వచ్చాయి. అలాగే నార్త్ అమెరికా, యూఎస్ఏలోనూ హిందీ వెర్షన్ కంటే తెలుగు వెర్షన్ కే ఎక్కువ వసూళ్లు వచ్చాయి. అలా వచ్చినా సినిమా 100 కోట్ల మార్క్ ను చేరలేదు అంటే ఆడియన్స్ లో ఈ మూవీపై ఉన్న అంచనాలు చెప్పొచ్చు. నిజానికి కూలీపై ఎక్కువ అంచనాలున్నాయి. బట్ కూలీ కంటెంట్ పరంగా వార్ 2 కంటే ఎక్కువ డిజప్పాయింట్ చేసింది. అందుకే ఈ ఫ్రైడే నుంచి వార్ 2 హవా మొదలవుతుందనుకుంటున్నారు. ఏదేమైనా ఎన్టీఆర్ కూడా లేకపోతే వార్ 2 ఆల్ టైమ్ డిజాస్టర్స్ లో చేరేదేమో అక్కడ.

Tags

Next Story