War 2 OTT : వార్ 2 .. ఓటిటి డేట్ వచ్చేసింది..

ఎన్టీఆర్, హృతిక్ రోషన్ హీరోలుగా నటించిన మూవీ వార్ 2. అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ నిర్మించింది. భారీ అంచనాల మధ్య ఆగస్ట్ 14న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ప్యాన్ ఇండియా మూవీ అయినా పెద్దగా ప్రమోషన్స్ కూడా చేయలేదు. ఈ కారణంగా కేవలం హిందీ, తెలుగులో మాత్రమే మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. మిగతా భాషల్లో సరైన ఓపెనింగ్స్ కూడా రాలేదు. దీనికి తోడు మొదటి రోజు నుంచే సినిమాకు మిక్స్ డ్ టాక్ రావడంతో కలెక్షన్స్ పై ప్రభావం చూపించింది. వార్ 2తో బాలీవుడ్ లో గ్రాండ్ గా డెబ్యూ చేయాలనుకున్న ఎన్టీఆర్ ఆశలూ నెరవేరలేదు.
ఇక వార్ 2 ఓటిటి డేట్ ఫిక్స్ అయింది. అక్టోబర్ 9 నుంచి వార్ 2 నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కాబోతోంది. అదే రోజున దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో స్ట్రీమ్ అవుతుంది. సో.. థియేటర్స్ లో మిస్ అయిన వాళ్లంతా ఓటిటిలో హ్యాపీగా చూసేయొచ్చు. అయితే థియేటర్స్ లో మిక్స్ డ్ రిజల్ట్ అందుకున్న చాలా సినిమాలు ఓటిటిలో పాజిటివ్ టాక్ తెచ్చుకుంటున్నాయి. మరి వార్ 2కు ఓటిటిలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com