War 2 : కూలీపై ‘వార్’ మొదలుపెట్టారా..

ఆగస్ట్ 14న ఇండియాలోనే బిగ్గెస్ట్ బాక్సాఫీస్ వార్ జరగబోతోంది. సూపర్ స్టార్ రజినీకాంత్, లోకేష్ కనకరాజ్ కాంబోలో రూపొందిన కూలీ, అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ హీరోలుగా నటించిన వార్ 2 ఒకే రోజు విడుదల కాబోతున్నాయి. ఈ క్లాష్ ను తప్పించాలని ప్రయత్నించారు. కానీ ఎవ్వరూ తగ్గలేదు. దీంతో కూలీని డామినేట్ చేయాలని వార్ 2 నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టింది. నిజానికి ఈ రెండు సినిమాల ట్రైలర్స్ రాకముందే ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. అందుకే ఈ డామినేటింగ్ ప్లాన్స్. అఫ్ కోర్స్ వార్ 2 తో తలపడేందుకు కూలీ దగ్గరా సాలిడ్ ప్లాన్స్ ఉన్నాయి.
యశ్ రాజ్ ఫిల్మ్స్ వాళ్లు దేశవ్యాప్తంగా అత్యధిక మల్టీ ప్లెక్స్ లలో తమ సినిమాను విడుదల చేయబోతున్నారు. అంటే కూలీకి తక్కువ మల్టీ ప్లెక్స్ లు మాత్రమే వచ్చేలా పావులు కదుపుతున్నారు. నార్త్ లో ఎలాగూ వార్ 2 డామినేషన్ ఉంటుంది. అందుకే కూలీ అందుకు భయపడటం లేదు. తమ టార్గెట్ అంతా మాగ్జిమం సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ గా పెట్టుకున్నారు. ఈ మేరకు వీళ్లు తమ మెయిన్ టార్గెట్ గా సౌత్ తో పాటు ఓవర్శీస్ అనుకుంటున్నారట. అంటే ఇక్కడ మల్టీప్లెక్స్ లు తగ్గినా ఇతర దేశాల్లో తమ సినిమా డామినేషన్ స్ట్రాంగ్ గా ఉంటుందనే నమ్మకంతో ఉన్నారు. ఎవరి నమ్మకం ఎలా ఉన్నా.. ఎవరి డామినేషన్ ఎలా ఉన్నా.. ఫైనల్ గా కంటెంట్ మాత్రమే మాట్లాడుతుంది. కంటెంట్ ఉంటేనే ఏ సినిమా అయినా నిలబడుతుంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com