War 2 Trailer : వార్ 2 ట్రైలర్.. వామ్మో ఇదేం యాక్షన్

War 2 Trailer :  వార్ 2 ట్రైలర్.. వామ్మో ఇదేం యాక్షన్
X

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ హీరోలుగా నటించిన వార్ 2 మూవీ ట్రైలర్ విడుదలైంది. తెలుగులో లాగా పెద్దగా హడావిడీ లేకుండానే ట్రైలర్ వచ్చేసింది. ట్రైలర్ చూసిన తర్వాత ఒక్కటే మాట.. మైండ్ బ్లోయింగ్. అంతే.. ఆ రేంజ్ లో ఉంది. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ లో వస్తోన్న ఈ స్పై మూవీస్ రేంజ్ కు ఏ మాత్రం తగ్గకుండా.. ఇంకా చెబితే డబుల్ అనేలా ఉంది యాక్షన్ డోస్.దీంతో పాటు ఇప్పటి వరకూ వచ్చిన ఊహాగానాలకు చెక్ పెడుతూ.. ఎన్టీఆర్ నెగెటివ్ రోల్ లో కనిపించడం లేదు అనే క్లారిటీ వచ్చేసింది. దేశానికి వ్యతిరేకంగా హృతిక్ రోషన్ పాత్ర కనిపిస్తోంది. ట్రైలర్ ఆరంభంలోనే అతను తన ఐడెంటినీ, అయిన వాళ్లను,ప్రేమించిన వారిని సైతం వదులేసి అందరికీ దూరంగా ఒక నీడలాగా మారిపోతానని.. ఒక ఊరూ పేరు లేని రూపం లేని నీడలాగా మారిపోతా.. అని చెప్పడం.. అందుకు భిన్నంగా ఎన్టీఆర్ 'నేను మాటిస్తున్నాను.. ఎవ్వరూ చేయలేని పనుల్ని నేను చేసి చూపిస్తాను.. ఎవ్వరూ పోరాడలేని యుద్దాన్ని నేను పోరాడతాను" అని చెప్పడం చూస్తే.. ఈ ఇద్దరి మధ్యే అసలైన సమరం జరిగేలా ఉంది. హృతిక్ రోషన్ తనకు జరిగిన సంఘటనల నుంచి ఆవేదనతోనే దేశానికి వ్యతిరేకంగా మారాడని.. చివర్లో తప్పు తెలుసుకుని ఇండియా ఫస్ట్ అంటూ షిఫ్ట్ అవుతాడని అర్థం అవుతోంది.

ఈ మూవీలో నటిస్తున్నాడని చెప్పినప్పుడు చాలామంది ఎన్టీఆర్ హైట్ పై కామెంట్స్ చేశారు. కానీ తనలో నటన అనే వెయిట్ ఎంత ఉందో అది హైట్ ను మరిపిస్తుందని చెప్పడానికి హృతిక్ రోషన్ కింద కూర్చుని ఉన్నప్పుడు అతని పక్కన కాలు పెట్టి కళ్లలోకి చూసే షాట్ చాలు.. అతను ఈ పాత్రకోసం ఎంత మార్చుకున్నాడో తెలియడానికి.

అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా కనిపిస్తోంది ఈ మూవీ. హాలీవుడ్ రేంజ్ యాక్షన్ తో ఆ స్థాయి ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఉన్నాయి. మొత్తంగా ఆగస్ట్ 14న వాల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ కు పూనకం వచ్చేయడం గ్యారెంటీ అనేలాగా ఈ ట్రైలర్ కట్ చేశారు. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ఏదేమైనా ఎన్టీఆర్ కు ఇది పర్ఫెక్ట్ బాలీవుడ్ డెబ్యూ అవబోతోందని మాత్రం చెప్పొచ్చు.

Tags

Next Story