Kantara : సినీ ప్రియులకు పండగ.. ఓటీటీలోకి వచ్చేసిన 'కాంతారా'..

Kantara: బాక్సాఫీస్ చార్ట్‌లలో అగ్రస్థానంలో నిలిచిన కన్నడ బ్లాక్‌బస్టర్ కాంతారా ఇప్పుడు OTT లోకి వచ్చేసింది. రిషబ్ శెట్టి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం 2022లో అత్యంత విజయవంతమైన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం దేశంలో విడుదలైన టాప్ 250 చిత్రాల జాబితాలో నంబర్ 1 స్థానంలో నిలిచింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది.
కాంతారా సినిమా థియేటర్‌లోకి సెప్టెంబర్ 30 న వచ్చింది. అక్టోబర్ 14న హిందీలో విడుదలైంది. ఈ చిత్రానికి రిషబ్ శెట్టి రచన మరియు దర్శకత్వం వహించారు. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ మరియు చలువే గౌడ నిర్మించిన ఈ చిత్రంలో రిషబ్ శెట్టి, సప్తమి గౌడ, కిషోర్ కుమార్ జి కీలక పాత్రలు పోషించారు.
కాంతారా బాక్సాఫీస్ కలెక్షన్
దాదాపు రూ.16 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన 'కాంతారా' ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లు వసూలు చేసింది.
కాంతారావు కథ
'కాంతారా' కథ కర్ణాటకలోని దక్షిణ కోస్తా రాష్ట్రంలోని కాడుబెట్టు అడవుల్లో నివసించే చిన్న సమాజం చుట్టూ తిరుగుతుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com