Weapon Teaser Release : యాక్షన్ ప్యాక్డ్ ఇంటెన్స్ పాత్రల్లో సత్య రాజ్, వసంత రవి

Weapon Teaser Release : యాక్షన్ ప్యాక్డ్ ఇంటెన్స్ పాత్రల్లో సత్య రాజ్, వసంత రవి
X
సత్యరాజ్‌, వసంత రవి కొత్త మూవీపై లేటెస్ట్ అప్ డేట్

బాహుబలి ఫేమ్ సత్యరాజ్‌, వసంత రవి ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం 'వెపన్‌'. చాగల్లు సురేష్‌ మేళం, నటి తాన్య హోప్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని మిలియన్ స్టూడియో పతాకంపై ఎంఎస్‌ మంజూర్‌ నిర్మిస్తున్నారు. కాగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పవర్ ఫుల్ యాక్షన్ టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. గుహన్ సెన్నియప్పన్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో ఆయన పాత్రలను ఓ రేంజ్ లో చూపించనున్నట్టు తెలుస్తోంది.

లేటెస్ట్ గా రిలీజ్ అయిన ఈ యాక్షన్ ప్యాక్డ్ ఇంటెన్స్ టీజర్ విషయానికొస్తే.. సత్య రాజ్, వసంత రవి పై చిత్రీకించిన యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకునే రీతిలో డిజైన్ చేశారు. నటన పరంగానూ వీరిద్దరూ తమ విలక్షణమైన యాక్టింగ్ తో ఇరగదీసినట్టు ఈ టీజర్ ను చూస్తేనే తెలుస్తుంది. ఇదిలా ఉండగా ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇక మూవీలో సత్య రాజ్, వసంత రవితో పాటు రాజీవ్ మీనన్, తాన్యా హోప్, రాజీవ్ పిళ్లై, యషికా ఆనంద్, మైమ్ గోపి, కణిత, గజరాజ్, సయ్యద్ సుభాన్, భరద్వాజ్ రంగన్ లాంటి పలువురు నటీనటులు వివిధ పాత్రల్లో నటిస్తున్నారు.


Tags

Next Story