Aryan Khan Bail: ఆర్యన్ ఖాన్‌కు బెయిల్.. అభిమానుల సంబరాలు..

Aryan Khan Bail: ఆర్యన్ ఖాన్‌కు బెయిల్.. అభిమానుల సంబరాలు..
Aryan Khan Bail: మూడు వారాల తర్వాత ఆర్యన్‌కు జైలు జీవితం నుంచి విముక్తి లభించనుంది.

Aryan Khan Bail: ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ లభించడంతో షారుక్ ఇంటి వద్ద అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. మూడు వారాల తర్వాత ఆర్యన్‌కు జైలు జీవితం నుంచి విముక్తి లభించనుంది. ముంబై హైకోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో ఇవాళ లేదా రేపు జైలు నుంచి విడుదలవనున్నాడు ఆర్యన్‌ ఖాన్. బెయిల్‌ పేపర్లు జైలుకు రావడానికి మధ్యాహ్నం దాటుతుందని, దీంతో సాయంత్రానికి ఆర్యన్‌ను విడుదల చేయొచ్చని చెబుతున్నారు.

ఒకవేళ బెయిల్‌ పేపర్లు రావడానికి ఆలస్యం అయితే రేపు ఉదయమే జైలు నుంచి బయటికొస్తాడు. అటు అర్బాజ్ మర్చంట్, మున్మున్ ధమేచాలకు కూడా హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మూడు వారాల పోరాటం తర్వాత ఆర్యన్‌కు బెయిల్ లభించటంతో షారుఖ్ ఫ్యామిలీకి పెద్ద రిలీఫ్ లభించినట్లయింది.

ఆర్యన్‌ తరపున గట్టిగానే వాదించారు ముకుల్ రోహత్గి. ఆర్యన్ ఖాన్ వద్ద ఎలాంటి డ్రగ్స్ లభించలేదని, అతను డ్రగ్స్ తీసుకున్నట్లు కూడా పరీక్షలు నిర్ధారించలేదని కోర్టులో వాదించారు. ఆర్యన్‌తో కలిసి వచ్చిన వ్యక్తి వద్ద డ్రగ్స్ ఉన్నంత మాత్రాన ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు.

క్రూయిజ్ షిప్ పార్టీకి ఆర్యన్‌ ప్రత్యేక అతిథిగా మాత్రమే వెళ్లాడని, ఒకవేళ డ్రగ్స్ అలవాటు ఉన్న యువకుడిని బాధితుడిగా చూడాలి తప్ప నిందితుడిగా కాదని అన్నారు. పైగా వాట్సాప్ చాటింగ్‌ల ఆధారంగా డ్రగ్స్ ఆరోపణలు చేయడం సబబు కాదని కోర్టు దృష్టికి తీసుకు వెళ్లారు.

అటు ఎన్సీబీ కూడా గట్టిగానే వాదించింది. ఆర్యన్ ఖాన్ రెగ్యులర్‌గా డ్రగ్స్‌ తీసుకుంటాడని, అతని వాట్సాప్ చాట్‌లు చూస్తే.. భారీగా డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోందని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో హైకోర్టులో వాదనలు వినిపించింది. ఆర్యన్‌కు బెయిల్‌ మంజూరు చేయొద్దని వాదించింది. ఇరు వాదనలు విన్న తర్వాత కోర్టు ఆర్యన్ ఖాన్ కు బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

Tags

Read MoreRead Less
Next Story