Dacoit collections : డెకాయిట్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత..?

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన మూవీ డెకాయిట్. ఈ మూవీకి ప్రమోషన్స్ పరంగా భారీగా లేకపోయినా.. ట్రైలర్ తర్వాత మిక్స్ డ్ ఒపీనియన్ వచ్చినా కూడా మొదటి రోజు వసూళ్ల పరంగా అదరగొట్టింది. షనీల్ డియో డైరెక్ట్ చేసిన ఈ మూవీకి అద్భుతమైన రివ్యూస్ వచ్చాయి. కొన్ని రివ్యూస్ యావరేజ్ గా అని తేల్చినా ఆడియన్స్ లో మాత్రం భారీ క్రేజ్ ఉంది. అందుకే ఈ మూవీ ఓపెనింగ్ రోజునే ఏకంగా 15 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ కలెక్షన్స్ ప్రీమియర్స్ తో కలిపి మొదటి రోజు వచ్చినవి. శేష్ మూవీస్ లో ఇప్పటి వరకు వచ్చిన హయ్యొస్ట్ ఓపెనింగ్స్ గా ఇది డిక్లేర్ అయింది. ఆ స్థాయిలో వసూళ్లు వస్తాయని శేష్ అండ్ టీమ్ కూడా ఊహించి ఉండరు. బట్ మూవీపై ఉన్న క్రేజ్ వల్ల ఇది సాధ్యం అయింది.
కంటెంట్ పరంగా చిన్న పాయింటే. కానీ దాని ఎగ్జిక్యూషన్ మాత్రం అదిరిపోయింది. బలమైన కథనం ఈ మూవీకి బిగ్ ప్లస్ పాయింట్ అయింది. నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతో సాగిన ఈ మూవీ చాలా వరకు మెప్పించింది. ఫస్ట్ హాఫ్ ఒకలా.. సెకండ్ హాఫ్ మరోలా సాగుతూ.. క్లైమాక్స్ లో ఇచ్చిన అద్భుతమైన ట్విస్ట్ బిగ్ ఎసెట్ అయింది. ఆ మాటకొస్తే ఈ మూవీలో చాలానే ట్విస్ట్ లు ఉన్నాయి. అది ఊహించని స్థాయిలో ఉండటం అనేది సినిమాకు అదనపు బలంగా మారింది. మొత్తంగా ఈ మూవీ వీకెండ్ వరకు మాగ్జిమం వసూళ్లు సాధించడం గ్యారెంటీ అనిపించేలా ఉంది. తర్వాతి వారం వరకు అన్ని ఎగ్జామ్స్ అయిపోతాయి. మరి అప్పటి వరకు ఈ మూవీ నిలబడితే వసూళ్లు ఓ రేంజ్ లో వస్తాయి అనేది నిజం.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
