Naga Chaitanya : తండేల్ లో హైలెట్స్ ఏంటీ..?

అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ ఊహించినట్టుగానే మంచి ఓపెనింగ్స్ తో రిలీజ్ అయ్యింది. మాగ్జిమం పాజిటివ్ టాక్ నే సొంతం చేసుకుంటుందీ మూవీ. దర్శకుడి లోపాల వల్ల కొన్ని డ్రా బ్యాక్స్ ఉన్నా.. చైతన్య హిట్టు కొట్టాడు అనే అంటున్నారు. సాయి పల్లవి స్టోరీ సెలక్షన్ మాగ్జిమం రాంగ్ కాదు అని తండేల్ మరోసారి ప్రూవ్ చేసిందీ అంటున్నారు. కంటెంట్ ఎలా ఉన్నా.. ఈ మూవీలో మెయిన్ హైలెట్స్ ఏంటీ అంటే కొన్ని విషయాల గురించి చెప్పుకోవాలి. పాకిస్తాన్ ఎపిసోడ్ ఉంది కాబట్టి.. ఇదేమీ ఆ తరహా ఎమోషనల్ మూవీ కాదు. ఆ ఎపిసోడ్ కూడా ఉన్న ఓ ప్యూర్ లవ్ స్టోరీ. ఒకే ఊరిలో పక్క పక్క ఇళ్లకు చెందిన అమ్మాయి, అబ్బాయి చిన్నప్పటి నుంచీ ప్రేమించుకున్న కథ. ఆ కథలో చిన్న ఎడబాటు అనేది పాకిస్తాన్ ఎపిసోడ్ అయితే.. ప్రేమకథే సినిమా అంతా నిండి ఉంటుంది.
ఇక హైలెట్స్ అంటే.. లవ్ స్టోరీయే హైలెట్. ఫస్ట్ హాఫ్ లో వీరి మధ్య వచ్చే సన్నివేశాలు, లైట్ హౌస్ సీన్స్ ఆకట్టుకుంటాయి. తమ యాసను ఎగతాళి చేశారని ఓ ఫైట్ ఉంటుంది. ఫైట్ బాలేదు కానీ.. ఆ ఫైట్ కు ఉన్న కారణం హైలెట్. ఇంటర్వెల్ కు ముందు తుఫాన్ సీన్ బిగ్గెస్ట్ హైలెట్. ఈ సీన్ చూస్తున్నంత సేపూ ఉత్కంఠగానే ఉంటుంది. ఓ పాకిస్తానీ జాలరి తుఫాన్ అలల తాకిడికి పడవ బోల్తా పడి ప్రాణాపాయంలో ఉంటే.. నాగ చైతన్య యాంకర్స్ తో వెళ్లి కాపాడ్డం సూపర్బ్ గా అనిపిస్తుంది.
సెకండ్ హాఫ్ చాలా వరకూ డల్ గానే ఉన్నా.. గుజరాతీ సేఠ్ దగ్గరకు వెళ్లి సాయి పల్లవి డబ్బుల వసూలు చేసుకుని వచ్చే సీన్ సింప్లీ సూపర్బ్. తను పెళ్లి చేసుకోబోయే వాడికి తన ప్రేమకథను చెప్పి.. ఒక మూడు విషయాలు రాజుకు చెప్పిన తర్వాత మూడు ముళ్లు వేయించుకుంటా అని చెప్పే సీన్ మరో హైలెట్.
పాక్ జైలు నుంచి బయటకు రాగానే బుజ్జితల్లికి పెళ్లి అని చెప్పినప్పుడు నాగ చైతన్య పర్ఫార్మెన్స్ సినిమాకే హైలెట్. అంతకు ముందు ఢిల్లీలో సాయి పల్లవి పెళ్లి కూతురు గెటప్ లో సుశీలా స్వరాజ్ కూతురును కలిసిన ఎపిసోడ్.. ఇలా ఇవన్నీ సినిమాకు హైలెట్ గా నిలిస్తే ఈ హైలెట్స్ అన్నిటినీ ఎలివేట్ చేసింది దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com