Kishkindhapuri Collections : కిష్కింధపురి మూడు రోజుల వసూళ్లు ఎంత.?

Kishkindhapuri Collections :  కిష్కింధపురి మూడు రోజుల వసూళ్లు ఎంత.?
X

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన సినిమా ‘కిష్కింధపురి’. కౌశిక్ పెగళ్లపాటి డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని సాహు గారపాటి నిర్మించాడు. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. క్రిటిక్స్ కూడా మంచి రివ్యూస్ నే అందించారు. మిరాయ్ వంటి పాన్ ఇండియా మూవీతో పాటు విడుదలైన కిష్కింధపురి కంప్లీట్ హారర్ మూవీ. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ అని చెప్పారు. మరీ సీట్ ఎడ్జ్ అయితే కాదు కానీ.. కొత్త నేపథ్యంలో కనిపించిన హారర్ గా సినిమా ఆకట్టుకుంది. కేవలం రెండు గంటల నిడివితోనే ఉన్న మూవీ కావడం సినిమాకు పెద్ద ప్లస్ అయింది. అయితే సినిమాకు అన్ని విధాలుగా పాజిటివ్ టాక్ వినిపించినా.. కలెక్షన్స్ విషయంలో మాత్రం బాగా అంటే బాగా వెనకబడిపోయింది. చాలాకాలంగా శ్రీనివాస్ మంచి సక్సెస్ కోసం చూస్తున్నాడు. ఈ విజయాన్ని కిష్కింధపురి ఇచ్చింది అని భావించారు. బట్.. వసూళ్లు చూస్తే డల్ గా ఉండటం గమనార్హం.

కిష్కింధపురి మూడు రోజుల్లో కేవలం 8.25 కోట్లు మాత్రమే వసూలు చేసింది. అయితే ఈ ఫిగర్స్ వివిధ మాధ్యమాల్లో కనిపిస్తున్నాయి తప్ప.. మూవీ టీమ్ నుంచి అఫీషియల్ గా ఇచ్చినవి కాదు. ఒకవేళ ఇవి నిజమే అయితే వారిని డిజప్పాయింట్ చేసే అంకెలే. నిజానికి సినిమాకు వచ్చిన టాక్ ను బట్టి చూస్తే మూడు రోజుల్లోనే మాగ్జిమం బ్రేక్ ఈవెన్ కు రావాలి. కానీ రాలేదు. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే 25 కోట్ల వరకూ వసూలు చేయాల్సి ఉందంటున్నారు. మరి మొదటి మూడు రోజుల్లోనే ఇంత డల్ గా ఉంటే.. వీక్ డేస్ లో ఇంకా వీక్ అయ్యే ప్రమాదం ఉంది. ఆ ప్రమాదాన్ని దాటి వీక్ డేస్ లో పుంజుకుంటే నెక్ట్స్ ఫ్రైడే వరకూ బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలున్నాయి. కాకపోతే మిరాయ్ తో పోటీ పడటమే సినిమాకు మైనస్ అయింది అనేవాళ్లూ లేకపోలేదు.

Tags

Next Story