Romantic Movie Puri: 'వాట్ డూ యూ వాంట్' అంటున్న రొమాంటిక్ కపుల్..

Romantic Movie Puri (tv5news.in)
Romantic Movie Puri: ఏ అంచనాలు లేకుండా ప్రారంభమయ్యి మినిమమ్ గ్యారెంటీ సినిమాగా మారింది 'రొమాంటిక్'. ఆకాశ్ పూరీ, కేతిక శర్మ జంటగా నటించిన ఈ సినిమా పూర్తిస్థాయి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది. ఇప్పటికే ఈ సినిమాలోని పాటలు, ట్రైలర్ అందరినీ ఆకట్టుకున్నాయి. అయితే ట్రైలర్‌లో ఫేమస్ అయిన డైలాగ్ 'వాట్ డూ యూ వాంట్' స్టేట్‌మెంట్‌తో పాటను కూడా తెరకెక్కించింది మూవీ టీమ్. ఇటీవల ఆ పాటను ప్రేక్షకులకు పరిచయం చేసింది కూడా.
కేతిక శర్మ ట్రైలర్‌లో కుర్రకారును ఆకట్టుకునేలా కనిపించింది. రొమాంటిక్ సినిమాలో ఆమె ఊతపదంగా మాట్లాడిన మాటే 'వాట్ డూ యూ వాంట్'. దీనిని ఒక మాస్ బీట్‌గా చేసి తయారు చేశారు సంగీత దర్శకుడు సునీల్ కశ్యప్. ఇప్పటికే ఈ సినిమాలో విడుదలయిన పాటలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. 'వాట్ డూ యూ వాంట్' పాటతో మంగ్లీ కూడా అదే రేంజ్‌లో ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో ఆకాశ్ పూరీ, కేతిక శర్మ హైలైట్‌గా నిలుస్తుందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com