Indian 2 ఆ శంకర్ కు ఏమైంది..?

Indian 2 ఆ శంకర్ కు ఏమైంది..?
X

శంకర్.. ఇండియన్ సినిమా హిస్టరీలో ఈ పేరుకు ఒక చరిత్ర ఉంది. మన సినిమాకు సంబంధించి ఉన్నఅనేక అనుమానాలను బద్ధలు కొట్టినవాడు శంకర్. బడ్జెట్ నుంచి సినిమా రేంజ్ వరకూ పూర్తిగా మార్చేశాడు. హాలీవుడ్ వాళ్లలా మనమూ సినిమాలు చేయొచ్చు అనే హోప్ ను క్రియేట్ చేసిందే అతను. బలమైన కథలకు తోడు విజువల్ గ్రాండీయర్స్ విషయంలో శంకర్ స్టైల్ కు ఫిదా కానివారు లేరు అప్పట్లో. అప్పుడప్పుడూ వృథా ఖర్చులు చేయిస్తాడు అనే పేరున్నా.. చూస్తున్నవారిని మరో లోకంలోకి పాటలతోనే తీసుకువెళ్లిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు రాజమౌళిలాగా చాలాయేళ్ల పాటు శంకర్ కు ఫ్లాప్ అన్నదే ఎదురుకాలేదు. రాజమౌళిలాంటి వారి ఊహాశక్తిని పెంచింది కూడా అతనే అంటే అతిశయోక్తి కాదు. అలాంటి శంకర్ కు ఇప్పుడు ఏమైందీ..? అంటూ భారతీయుడు2 చూసిన దగ్గర్నుంచీ ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు. యస్.. జెంటిల్ మేన్ నుంచి రోబో వరకూ శంకర్ సినిమా అంటే సౌత్ మొత్తం ఎదురుచూసింది. 1993లో వచ్చిన ఫస్ట్ మూవీ జెంటిల్ మేన్ నుంచి 2010లో వచ్చిన రోబో వరకూ అతను చేసింది కేవలం పది సినిమాలే. వీటిలోనే ప్రేమికుడు, భారతీయుడు, జీన్స్, ఒకే ఒక్కడు, బాయ్స్, అపరిచితుడు, శివాజీ, రోబో లాంటి క్లాసిక్ హిట్స్ ఉన్నాయి.

2012లో చేసిన నన్బన్( హందీ త్రీ ఇడియట్స్ కు రీమేక్) నుంచి శంకర్ పతనం ప్రారంభం అయింది. తర్వాత అపరిచితుడు కాంబోలో హై ఎక్స్ పెక్టేషన్స్ తో వచ్చిన ‘ఐ’ మూవీ ఆల్ టైమ్ డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచింది. తర్వాత 2.0 మూవీ కలెక్షన్స్ స్ట్రాంగ్ గా ఉన్నా.. లాభాలు తేలేదు అనేది అందరికీ తెలుసు. ఈ టైమ్ లో తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన శంకర్.. భారతీయుడు సీక్వెల్ చేసి అభాసుపాలు కావడం ఆశ్చర్యమే.పైగా ప్రస్తుతం ప్యాన్ ఇండియన్ స్టార్ రామ్ చరణ్ తో గేమ్ ఛేంజర్ చేస్తున్నాడు. భారతీయుడు2 బ్లాక్ బస్టర్ అయి అతను ట్రాక్ లో వచ్చి ఉంటే గేమ్ ఛేంజర్ బిజినెస్ రికార్డులు క్రియేట్ చేసేదే. బట్ భారతీయుడు2 పోవడంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా భయపడుతున్నారు అనేది నిజం. అలాగని శంకర్ ను తక్కువ అంచనా వేయలేం. రామ్ చరణ్ లాంటి హీరోతో ఆషామాషీ సినిమా చేస్తాడు అనుకోలేం. బట్ ఇప్పుడు భారతీయుడు2 చూసిన ఎవరికైనా అలాంటి డౌట్స్ ఉంటే తప్పేం లేదు కూడా. ఒక వేళ గేమ్ ఛేంజర్ రిజల్ట్ తేడా కొడితే ఇండస్ట్రీలో శంకర్ గేమ్ కూడా ముగిసిపోతుందనే చెప్పాలి.

Tags

Next Story