West Bengal: ఏమైంది.. ఎందుకిలా.. అర్థరాత్రి మరో మోడల్ ఆత్మహత్య..

West Bengal: పశ్చిమ బెంగాల్ వినోద ప్రపంచంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కొద్ది రోజుల వ్యవధిలోనే ముగ్గురు మోడల్స్ అర్థాంతరంగా తనువు చాలించారు. ఇప్పుడు మేకప్ ఆర్టిస్ట్ కూడా ఇదే తరహాలో ఉరి వేసుకుని మరణించడం చర్చనీయాంశంగా మారింది. మేకప్ ఆర్టిస్ట్ పేరు సరస్వతీ దాస్. నిన్న రాత్రి ఆమె తన కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడింది. అయితే ఆ సమయంలో ఏమాత్రం అనుమానం రాలేదు ఆమె మీద వారికి.. తర్వాత అలాంటిది జరుగుతుందని కూడా ఎవరూ ఊహించలేకపోయారు. మేకప్‌తో పాటు ఫోటో షూట్‌లు కూడా చేసేది.
గత 14 రోజుల్లో నాలుగు అసాధారణ మరణాలు చోటు చేసుకున్నాయి పశ్చిమ బెంగాల్ లో. ముగ్గురు మోడళ్ల తర్వాత, ఈసారి కస్బాలో మేకప్ ఆర్టిస్ట్ అసాధారణ మరణం కలచి వేసింది. మృతికి గల కారణాలపై కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. ముందుగా నటి పల్లవి, ఆ తర్వాత విదిషా డి మజుందార్, మంజుషా నియోగి రోజుల వ్యవధిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు.
మేకప్ ఆర్టిస్ట్ సరస్వతి డే అసాధారణ మరణం చుట్టూ కొన్ని అనుమానాలు రేకెత్తుతున్నాయి. కుటుంబ వర్గాల కథనం ప్రకారం.. సరస్వతి దాస్ తన అమ్మమ్మ ఇంట్లో 18 ఏళ్లుగా తన తల్లితో కలిసి ఉంటోంది. ఎప్పుడూ సరదాగా ఉండే సరస్వతీ దాస్ కి ఒక్కసారిగా ఏం జరిగిందో కుటుంబ సభ్యులు ఊహించలేకపోతున్నారు. మేకప్ ఆర్టిస్ట్ సరస్వతీ దాస్ అసాధారణ మరణంతో గ్లామర్ ప్రపంచంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
రెండు రోజుల క్రితమే నటి మంజూషా నియోగి ఉరి వేసుకుని మరణించింది. ఆమె ఇటీవల మరణించిన విదిషా డి మజుందార్‌కి స్నేహితురాలు. విదిషా మరణంతో మంజూష డిప్రెషన్‌లో ఉన్నట్లు కుటుంబ వర్గాలు తెలిపాయి. ఆ డిప్రెషన్‌తోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందా అనే విషయాన్ని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గ్లామర్ ప్రపంచంలో ఒకరి తర్వాత మరొకరు ఆత్మహత్యలకు పాల్పడడంతో బెంగాల్ టాలీవుడ్ లో విషాదఛాయలు అలుముకున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com