Jr. Ntr : ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీట్ ఏమైంది..?

Jr. Ntr :  ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీట్ ఏమైంది..?
X

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తన ప్యాన్ ఇండియా ఇమేజ్ ను నెక్ట్స్ లెవల్ కు తీసుకువెళ్లే ప్రయత్నాల్లో ఉన్నాడు. ప్రస్తుతం హిందీ డెబ్యూ మూవీ వార్ 2 షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. త్వరలోనే ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో రూపొందుతోన్న ‘డ్రాగన్’మూవీ సెట్స్ లోకి వెళ్లబోతున్నాడు. ఈ రెండు సినిమాలూ తన కెరీర్ ను మరో మలుపు తిప్పుతాయి అనే నమ్మకంతో ఎన్టీఆర్ ఉన్నాడు. అభిమానులూ అదే భావిస్తున్నారు. అయితే కొన్ని రోజుల క్రితం ఎన్టీఆర్ తన ఫ్యాన్స్ ను పట్టించుకోవడం లేదు అని.. ఇంతకు ముందులాగా అభిమానులను కలవడానికి ఇష్టపడటం లేదు అని.. కొందరు ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదన వెల్లగక్కారు. ఇది నిజమే అంటూ మిగతా అభిమానులు కూడా అదే పనిగా దాన్ని ట్రెండ్ చేశారు. నిజానికి 2016లో వచ్చిన అరవింద సమేత వరకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో రెగ్యులర్ గా టచ్ లో ఉండేవాడు. సెట్స్ లోనే ఫ్యాన్స్ తో ఫోటోస్ దిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ ఆర్ఆర్ఆర్ మూవీ రాజమౌళిది కాబట్టి ఆ అవకాశం లేకుండా పోయింది. ఈ మూవీ ఎక్కువ కాలం చిత్రీకరణ జరుపుకోవడం.. తర్వాత పాండమిక్.. ఇవన్నీ కలిపి ఎన్టీఆర్ ను అభిమానులకు దూరం చేశాయి. అయితే దేవర టైమ్ లో కూడా ఆయన పెద్దగా టైమ్ ఇవ్వలేదు అనేది అభిమానుల ఆరోపణ. అందుకే ఆయన మమ్మల్ని పట్టించుకోవడం లేదు అని ఫీలవుతున్నారు. ఈ ఫీలింగ్ ‘ఎన్టీఆర్ ఆఫీస్’ వరకూ వెళ్లింది. అందుకే ఆ మధ్య అతి త్వరలోనే ఫ్యాన్స్ అందరినీ కలిసేలా ప్లాన్ చేస్తున్నారనీ.. ఒక వేదిక చూసి అక్కడే అందరినీ కలుస్తారని ఆయన ఆఫీస్ నుంచి అఫీషియల్ గా ఓ ప్రకటన వచ్చింది. ఈ ప్రకటన వచ్చి పక్షం రోజులు దాటింది. అయినా ఇంత వరకు ఫ్యాన్స్ మీట్ కు సంబంధించిన అప్డేట్స్ ఏం కనిపించడం లేదు.

కొన్నాళ్లుగా చూస్తే ఎన్టీఆర్ కు అభిమానులు తగ్గుతున్నారని చాలామంది విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే సోషల్ మీడియా వేదికగా అతనిపై ఇతర హీరోల అభిమానులు దాడులు చేస్తే దానికి తగ్గ కౌంటర్స్ మిగిలిన వాళ్లు ఇవ్వలేకపోయారు అనేది అందరూ చూస్తున్నదే. మరి ఇలాంటివి చేస్తే ఈ దూరం ఇంకా పెరుగుతుంది. అసలే నందమూరి హీరోల మధ్య నాన్ స్టాప్ వార్ జరుగుతోంది. కేవలం నందమూరి బాలయ్య చాలు అనుకుంటే ఎన్టీఆర్ ఫ్యాన్ బేస్ ఏ లెవల్ కు తగ్గుతుందో ఊహించుకోవచ్చు. సో.. అభిమానులతో రెగ్యులర్ గా కాకపోయినా అప్పుడప్పుడైనా టచ్ లో ఉండాలి.

Tags

Next Story