Vaishnav Tej : ఈ మెగా హీరోకు ఏమైంది..?

ఫస్ట్ మూవీతోనే బెస్ట్ హిట్ అందుకుంటే ఆ కిక్కే వేరు అంటారు. బట్ ఆ కిక్ ను కంటిన్యూ చేయకపోతే.. వెంటనే దిగిపోతుంది కూడా. ప్రస్తుతం ఆ పరిస్థితిలోనే ఉన్నారు మెగా కుర్రాడు వైష్ణవ్ తేజ్. చిరంజీవి మేనల్లుడుగా, సాయిదుర్గాతేజ్ తమ్ముడుగా తెలుగు తెరపై హీరోగా అరంగేట్రం చేసిన వైష్ణవ్ ఫస్ట్ మూవీ ఉప్పెనతోనే బెస్ట్ ఇంప్రెషన్ వేశాడు. మొదటి సినిమా అయినా.. పాత్ర వైవిధ్యమైనదైనా.. తనదైన శైలిలో నటించి ఆకట్టుకున్నాడు. మంచి ఫ్యూచర్ ఉన్న కుర్రాడు అనిపించుకున్నాడు. ఇక సినిమా కూడా ఏకంగా 100 కోట్లు కొల్లగొట్టడంతో మెగా ఫ్యామిలీ కూడా ఫుల్ ఖుష్ అయింది.
కట్ చేస్తే ఆ ఖుష్ ను కొనసాగించలేకపోయాడు వైష్ణవ్. క్రిష్ డైరెక్షన్ లో చేసిన కొండపొలం.. ఉప్పెన విజయాన్నందాన్ని కొండెక్కించింది. ఆపై చేసిన రంగరంగ వైభవంగా, ఆదికేశవ చిత్రాలు ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్ అనిపించుకున్నాయి. దీంతో ఒక్కసారిగా ఉస్సూరుమనిపోయాడు. అటు మెగా ఫ్యామిలీ కూడా కుర్రాడి వైఫల్యాన్ని చూసి షాక్ తిన్నది. ఇటు సాయిదుర్గాతేజ్ విరూపాక్షతో 100 కోట్లు కొట్టి ఆ ఊపును డబుల్ చేసేలా సంబరాల ఏటిగట్టు అనే సినిమాతో సిద్ధం అవుతున్నాడు. బట్ తమ్ముడు మాత్రం కామ్ గా కనిపిస్తున్నాడు.
అసలు ఇప్పుడు వైష్ణవ్ తేజ్ ఏం చేస్తున్నాడు. ఏదైనా కొత్త ప్రాజెక్ట్ కోసం ప్రిపేర్ అవుతున్నాడా.. లేక కథలు మాత్రమే వింటున్నారా.. ఇలాంటి వివరాలేవీ బయటకు రావడం లేదు. అంటే సడెన్ గా సినిమాతో వస్తారా లేక కావాలనే కొంత గ్యాప్ ఇచ్చారా అనేది మెగా టీమ్ నుంచి ఎవరైనా చెబుతారేమో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com