Varun Tej : వరుణ్ తేజ్ మెగా సపోర్ట్ ఏమైంది..?

Varun Tej :  వరుణ్ తేజ్ మెగా సపోర్ట్ ఏమైంది..?
X

వరుణ్ తేజ్.. నాగబాబు తనయుడుగా వచ్చినా.. మెగా ప్రిన్స్ అన్నంత పనిచేశారు ఫ్యాన్స్. అందుకు తగ్గట్టుగానే మొదట్లో అతని అడుగులు పడ్డాయి. బట్ కొన్నాళ్లుగా ఆ అడుగులు తడబడుతున్నాయి. వరుసగా ఒకదాన్ని మించిన ఒకటి అన్నట్టుగా ఫ్లాప్ లు చూస్తున్నాడు. తాజాగా చాలా కాన్ఫిడెంట్ తో కనిపించిన మట్కాతో మరో డిజాస్టర్ చూశాడు. కరుణ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ పీరియాడిక్ డ్రామా అత్యంత నీరసంగా ఉండటంతో చూస్తున్న ప్రేక్షకులు కూడా అంతే నీరసపడిపోయారు. దీంతో వరుణ్ ‘బాబు’ ఖాతాలో మరో డిజాస్టర్ యాడ్ అయింది. మినిమం కలెక్షన్స్ కూడా లేవీ సినిమాకు. మొదటి రోజు కేవలం 70 లక్షలు మాత్రమే వసూళ్లయ్యాయి. సెకండ్ డే పూర్తిగా డ్రాప్ అయిపోయాయి బుకింగ్స్.. అంటే సినిమా పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

అయితే ఈ మొత్తం ఫ్లాపులు చూస్తున్నప్పుడు చాలామందికి ఓ అనుమానం కలుగుతోంది. వరుణ్ కు మెగా సపోర్ట్ ఎందుకు లేదు. కేవలం ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ లో కాదు.. స్క్రిప్ట్ దశ నుంచే ఎవరూ ఎందుకు మానిటర్ చేయడం లేదు అనే డౌట్ కలుగుతోంది. అంతే కాదు. మెగా ఫ్యామిలీలో ఇతర హీరోలను ఓన్ చేసుకున్నంతగా వరుణ్ తేజ్ ను ఓన్ చేసుకోవడం లేదు మెగా ఫ్యాన్స్. అంటే ఫ్యామిలీతో పాటు ఫ్యాన్స్ కూడా ఒకేసారి వదిలేశారా అనిపిస్తోంది.

ఇప్పటికే వరుణ్ తేజ్ కెరీర్ పూర్తిగా డల్ అయిపోయింది. ఈ ఫ్లాప్ తో మరింత ప్రమాదంలో పడిపోయింది. కేవలం కథల్లోని మెరుపులను మాత్రమే కాదు. కాస్త డీటెయిల్డ్ గా అర్థం చేసుకునే మెచ్యూరిటీ వరుణ్ లో కనిపించడం లేదు. అటు నాగబాబులో ఆ సత్తా ఉంటే ఆయన నిర్మాతగానే సక్సెస్ అయ్యేవాడు కదా.. సో.. వరుణ్ స్టోరీ సెలక్షన్ అనేది ఆయన ఇల్లు దాటి మెగాస్టార్ వరకూ వస్తే కానీ సిట్యుయేషన్ లో మార్పులు ఉండవు. లేదంటే ఇంక తెర వెనక్కి వెళ్లిపోవడానికి ఎన్నో ఫ్లాపులు పట్టవు.

Tags

Next Story