Koratala Siva Devara : అజ్ఞాతవాసి, ఆచార్యతో దేవరకు ఉన్న సంబంధం ఏంటీ..?

Koratala Siva Devara :  అజ్ఞాతవాసి, ఆచార్యతో దేవరకు ఉన్న సంబంధం ఏంటీ..?

ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో సినిమా అనగానే చాలామంది అనుమానపడ్డారు. తారక్ ఫ్యాన్స్ అయితే వద్దే వద్దు అనుకున్నారు. బట్ ఎన్టీఆర్ తగ్గలేదు. కొరటాలతోనే కమిట్ అయ్యాడు. నిజానికి ఈ మూవీ స్థానంలో త్రివిక్రమ్ తో సినిమా చేయాలి. అది క్యాన్సిల్ కావడంతో కొరటాల లైన్ లోకి వచ్చాడు. అప్పుడే చాలామంది వద్దన్నారు. ట్రైలర్ వచ్చిన తర్వాత ఎక్కువమంది చేసిన కామెంట్.. దేవర మరో ఆచార్య కాబోతోందని. ముఖ్యంగా యాంటీ ఫ్యాన్స్ ఈ డైలాగ్ ను పాపులర్ చేయాలని చూశారు. బట్ టీమ్ అగ్రెసివ్ గా ప్రమోషన్స్ మొదలుపెట్టింది. జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్ బాలీవుడ్ లో బాగా కవర్ చేస్తున్నారు. ఆల్రెడీ ఆర్ఆర్ఆర్ తో అక్కడ క్రేజ్ తెచ్చుకున్నాడు ఎన్టీఆర్.. అదీ కాక అలియా భట్ తో ఉన్న స్నేహం వల్ల కరణ్ జోహార్ కూడా ఇంటర్వ్యూ చేశాడు. ఇటు తెలుగు స్టేట్స్ లో ప్రీ రిలీజ్ క్యాన్సిల్ అయినా మిగతా రాష్ట్రాల్లో గట్టి ప్రమోషన్స్ నే ప్లాన్ చేస్తున్నారు. రెండో ట్రైలర్ వచ్చిన తర్వాత కాస్త నమ్మకం పెరిగింది. అయినా ఆచార్య డైలాగులు ఆగడం లేదు. కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ విషయంలో అజ్ఞాతవాసి టైమ్ ను గుర్తు చేసుకోవాలి.

శుభమా అంటూ ఆరేళ్ల తర్వాత సోలోగా వస్తోంటే అజ్ఞాతవాసి, ఆచార్య అంటూ భయపెడతారేంటీ అనుకుంటున్నారా..? ఎగ్జాట్లీ.. బట్ భయం కాదు. ఆరేళ్ల క్రితం చేసిన అరవింద సమేతను గుర్తు చేసుకోండి. ఆ సినిమాకు ముందు త్రివిక్రమ్ కూడా కొరటాల ఆచార్య రేంజ్ లో అజ్ఞాతవాసితో ఆల్ టైమ్ డిజాస్టర్ చూశాడు. అప్పుడూ త్రివిక్రమ్ తో సినిమా చేయొద్దని చాలామంది ఎన్టీఆర్ ను వార్న్ చేశారు. అతను వినలేదు. త్రివిక్రమ్ టాలెంట్ పైనే అందరికీ అనుమానాలు వచ్చిన సందర్భం అది. అలాంటి టైమ్ లో అడుగు ముందుకు వేశాడు.. అరవింద సమేత వీరరాఘవ చేశాడు. ఎన్టీఆర్, త్రివిక్రమ్ చేసిన ఫస్ట్ మూవీ ఇది. అందుకే ఈ కాంబినేషన్ లో ఎక్స్ పెక్ట్ చేసినంత బ్లాక్ బస్టర్ కాలేదుదు. కానీ సూపర్ హిట్ అనిపించుకుంది.

సేమ్ ఆచార్య తర్వాత కొరటాలతో సినిమా విషయంలోనూ ఇదే కనిపించింది. బట్ అరవింద సమేతలాగా ఆచార్య రిజల్ట్ రిపీట్ కాదు అనేది ఎన్టీఆర్ నమ్మకం. పైగాఇప్పుడు సిట్యుయేషన్ మారింది. ఎన్టీఆర్ ఇమేజ్ ప్యాన్ ఇండియా స్థాయిలో పెరిగింది. సినిమాకు అరవింద సమేతలా హిట్ టాక్ వస్తే చాలు.. బ్లాక్ బస్టర్ గా మారిపోతుంది. దీనికి తోడు దసరా హాలిడేస్ బాగా కలిసొస్తాయి. అప్పుడు ఆచార్య అంటూ కామెంట్స్ చేసిన వాళ్లు నోళ్లు మూసుకుంటారు. బట్ అలా జరగాలంటే దేవర కంటెంట్ కచ్చితంగా బావుండాలి. అప్పుడే బ్లాక్ బస్టర్ అవుతుంది... ప్యాన్ ఇండియా హీరో అనే టెస్ట్ లో ఎన్టీఆర్ ఫస్ట్ క్లాస్ లో పాసవుతాడు.

Tags

Next Story