Samantha: సమంతకు వచ్చిన వ్యాధి ఏంటి.. 'మైయోసైటిస్' అంటే..

Samantha: సమంతకు వచ్చిన వ్యాధి ఏంటి.. మైయోసైటిస్ అంటే..
Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన యాక్షన్ థ్రిల్లర్ యశోద నవంబర్ 11న రిలీజ్ అవనుంది.

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన యాక్షన్ థ్రిల్లర్ యశోద నవంబర్ 11న రిలీజ్ అవనుంది. సినిమా విషయం పక్కన పెడితే సామ్ ఈ మధ్య సిక్కయిన విషయం అందరికీ తెలిసిందే.. కానీ తనకు వచ్చిన వ్యాధి ఏంటో అర్థం కాక ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.


సామ్ సోషల్ మీడియా వేదికగా తన వ్యాధి గురించి పంచుకుంది. తాను అరుదైన మైయోసిటీస్ వ్యాధి బారిన పడ్డానని తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది సామ్. అసలు ఏంటి ఈ మైయోసైటీస్.. ఇది ప్రాణాంతక వ్యాధా అని ఆరాతీస్తే అంటే అవుననే చెబుతున్నారు డాక్టర్స్. ఈ వ్యాధి వల్ల ఒక్కోసారి అంగవైకల్యంతో పాటు ప్రాణాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుందట.

''అభిమానులు చూపించే ప్రేమ, అనుబంధమే తనకు తన జీవితంలో ఎదురైయే ప్రతీ ఛాలెంజ్ ను ఫేస్ చేసేందుకు శక్తిని ఇస్తోందని సమంత తెలిపింది. అంతేకాకుండా కొన్ని నెలలుగా తాను మైయోసైటిస్ అనే అటో ఇమ్యూన్ కండిషన్ తో బాధపడుతున్నట్లు తెలిపింది.


దీంతో తనకు ప్రతి రోజూ కష్టంగా ఉందని చెబుతూనే.. ఈ రోజు గడిస్తే చాలు అని భావించిన సందర్భాలు చాలా ఉన్నాయని తను చెప్పిన మాటకు చాలామంది ఎమోషనల్ అవుతున్నారు. అయినా ఇప్పటి వరకూ తను ఎదుర్కొన్న సమస్యల్లాగానే ఈ సమస్య నుంచి కూడా బయటపడతాననే కాన్ఫిడెన్స్ ను వ్యక్తం చేసింది.

అలాగే తాను త్వరలోనే పూర్తిగా కోలుకుంటానని వైద్యులు నమ్ముతున్నారని... ఫిజికల్ గా ఎమోషనల్ గా తాను చాలా సమస్యలు ఎదుర్కొన్నానని.. చివరిగా ఐ లవ్యూ అంటూ.. చాలా ఎమోషనల్ గా రాసుకొచ్చింది సమంత". దీంతో పాటు ఈ పోస్ట్ లో సామ్ ఆస్పత్రిలో బెడ్ పై ఉండి చేతులతో లవ్ సింబల్ వేసి ప్రేక్షకులపై ఉన్న ప్రేమను తెలియజేసింది. ఈ ఫోటో చూసిన ఫ్యాన్స్ మరింత ఫీలవుతున్నారు.

అసలు ఈ మయోసైటీస్ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి.. ఈ వ్యాధి సోకిన వారు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారు అని చాలామంది అభిమానులు నెట్ లో సెర్చ్ లు మొదలుపెట్టారు.

సమంతకు సోకిన మయోసైటీస్ వ్యాధి లక్షలో కేవలం నలుగురికి మాత్రమే వస్తుందని వైద్యులు చెబుతున్నారు. దీని కారణంగా అంగవైకల్యం కలుగుతుంది. ప్రధాన అవయవాలు కూడా పని చేయకుండా పోతాయి. ఒక్కోసారి మరణం కూడా సంభవించ వచ్చు. వీటితో పాటు ఆ పేషెంట్స్ బాధ వర్ణనాతీతం. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత నిజంగా సామ్ ఇంత బయంకరమైన వ్యాధిని భరిస్తోందా..? అని చాలామంది సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story