Hero Yash : యశ్ ఏంటి అలా చేస్తున్నాడు

స్టార్ హీరోలు, టాప్ హీరోల సినిమాలు అంటే ఆడియన్స్ లో ఓ క్రేజ్ ఉంటుంది. లేదంటే పెంచాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఈ రెండు విషయాలు కూడా హీరో యశ్ విషయంలో మిస్ అయ్యాయి. కేజీఎఫ్2 తర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. అతని తర్వాతి సినిమా ఏంటీ అనే సందిగ్ధంలో ఉండగా.. మళయాల దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ను సెలెక్ట్ చేసుకున్నాడు. ఆ సినిమా టాక్సిక్. ఈ మూవీలో కాస్టింగ్ భారీగా ఉంది. టాప్ హీరోయిన్లు అయిన నయనతార, కియారా అద్వానీ, రుక్మిణి వసంత్ తో పాటు హ్యూమా ఖురేషీ లాంటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కూడా తీసుకున్నారు. టోవినో థామస్ ఓ కీ రోల్ లో కనిపించబోతున్నాడు. అన్నీ ఉన్నా అదేదో అన్నట్టుగా ఈ మూవీపై అస్సలే మాత్రం బజ్ క్రియేట్ కావడం లేదు.
టాక్సిక్ ఈ నెల 19నే విడుదల కాబోతోంది. బట్ ప్యాన్ ఇండియా రేంజ్ మూవీ అని చెప్పడమే తప్ప ఆ స్థాయిలో బజ్ క్రియేట్ కావడం లేదీ మూవీకి. రీసెంట్ గా విడుదలైన టీజర్ కాస్త అటెన్షన్ తెచ్చుకుంది. తాజాగా విడుదల చేసిన ఒక పాటతో ఊపు వస్తుంది అనుకుంటే నీరసం వచ్చేసింది. పాటలో కనీసం అక్కడక్కడైనా వీడియో చేయాల్సింది. బట్ కేవలం ఆడియో మాత్రమే పరిమితం కావడంతో ఆడియన్స్ తో పాటు ఫ్యాన్స్ లో కూడా ఓ రకంగా నిస్తేజం కనిపిస్తోంది. మరి యశ్ ఏమైనా చేస్తాడా సినిమాపై ఊపు పెంచుతాడా అంటే అదీ లేదు. అతని వైపు నుంచి మినిమం క్రేజ్ కూడా కనిపించడం లేదు. అసలు కేజీఎఫ్ హీరోనే ఇతను అనేలా ఉంది. అటు చూస్తే ధురంధర్ 2 మాంచి ఊపులో ఉంది. అలాంటి మూవీపై టాక్సిక్ వేయడం అనేదే సాహసం అనుకుంటే అస్సలు ప్రమోషన్స్ లేకుండా రిలీజ్ ప్లాన్ చేయడం ఏంటో తెలియడం లేదు. ఓ రకంగా చూస్తే ఈ మూవీ వాయిదా పడినా ఆశ్చర్యం లేదు అంటున్నారు. మరి ఎందుకు ఇలా చేస్తున్నాడో తెలియదు కానీ యశ్ ఈ విషయంలో మాత్రం రాంగ్ స్టెప్ లే వేస్తున్నట్టుగానే ఉంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
