Natarajan Subramaniam : మహారాజా పోలీస్ కు త్రివిక్రమ్ కు సంబంధం ఏంటీ

Natarajan Subramaniam  : మహారాజా పోలీస్ కు త్రివిక్రమ్ కు సంబంధం ఏంటీ
X

రీసెంట్ గా తమిళ్ తో పాటు తెలుగులోనూ విడుదలైన మహారాజా సినిమాకు అద్భుతమైన రివ్యూస్ అండ్ రెవిన్యూ వచ్చింది. విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించిన ఈ మూవీలో అతని తర్వాత ఎక్కవగా ఆకట్టుకున్న నటుడు పోలీస్ ఆఫీసర్ గా నటించిన నటరాజ సుబ్రహ్మణ్యన్. అందరూ అతన్ని నట్టి అని పిలుస్తారు తమిళ్ లో. అయితే ఇప్పటికే కొన్ని డబ్బింగ్ మూవీస్ తో తెలుగు వారికి కొంత పరిచయం ఈ నటుడు. నటుడుగానే కాదు.. అతని బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోతాం. చూడ్డానికి చాలా సాధారణంగా కనిపించే నట్టి.. హిందీలో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ కు సినిమాటోగ్రాఫర్. సినిమాలపై ఇంట్రెస్ట్ తో చిన్నప్పుడే చదువులు మానేసి కెమెరామేన్ గా ఫంక్షన్స్ కు పనిచేస్తూ ఓ చిన్న మ్యూజిక్ బ్యాండ్ కు కెమెరా వర్క్ చేసేవాడు. యూఫోరియా అనే ఆ మ్యూజిక్ బ్యాండ్ కు అతను చేసిన వర్క్ నచ్చిన రామ్ గోపాల్ వర్మ తన సినిమాకు సినిమాటోగ్రఫీ చేయమని చెప్పాడు. కానీ అది వర్కవుట్ కాలేదు. దీంతో తన శిష్యుడు అనురాగ్ కశ్యప్ కు నట్టిని పరిచయం చేశాడు. అనురాగ్ కు కూడా అతని వర్క్ నచ్చడంతో ఒకేసారి మూడు సినిమాలకు కెమెరామేన్ గా ఆఫర్ ఇచ్చాడు. మధ్యలో ఓ తమిళ్ మూవీకీ సినిమాటోగ్రఫీ అందించాడు.

తర్వాత నటుడుగానూ ప్రయత్నించినా బ్రేక్ రాలేదు. బట్ శతురంగ వేట్టై( తెలుగులో బ్లఫ్ మాస్టర్ గా సత్యదేవ్ తో రీమేక్ చేశారు) తో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. నటిస్తూనే బాలీవుడ్ లో బ్లాక్ ఫ్రైడే, పరిణీత, జబ్ వియ్ మెట్, గోల్ మాల్ రిటర్న్స్, లవ్ ఆజ్ కల్, రాంఝనా, హాలిడే : ఏ సోల్జర్ ఈజ్ నెవర్ ఆఫ్ డ్యూటీ అనే బిగ్ బ్లాక్ బస్టర్స్ కు కెమెరామేన్ గా వర్క్ చేశాడు. విజయ్ కి తెలుగులో మార్కెట్ తెచ్చిన తుపాకీ సినిమాకూ అతనే కెమెరామేన్.

రామ్ గోపాల్ వర్మ ఇన్వెంట్ చేసిన ఈ టాలెంట్ ను తెలుగులో వాడుకున్న ఒకే ఒక్క దర్శకుడు త్రివిక్రమ్. నితిన్, సమంత జంటగా ఆయన రూపొందించిన అ ఆ సినిమాకు నటరాజే సినిమాటోగ్రాఫర్. అలాగే త్రివిక్రమ్ నిర్మంచిన ఛల్ మోహన రంగాకూ అతనే కెమెరామేన్. ఛల్ మోహన రంగా తర్వాత మళ్లీ ఏ భాషలోనూ సినిమాటోగ్రాఫర్ గా పనిచేయలేదు నట్టి. ఎందుకంటే నటుడుగా చాలా చాలా బిజీ అయిపోయాడు. కొందరు చూడ్డానికి నార్మాల్ గానే కనిపిస్తారు కానీ.. వారిలో అసాధారణమైన ప్రతిభ ఉంటుంది. అందుకు నటరాజ సుబ్రహ్మణ్యన్ ఓ ఉదాహరణ.

Tags

Next Story