Saraswathi Movie : ఈ వారం థియేటర్స్ లో విడుదలయ్యే మూవీస్ ఏంటీ..?

Saraswathi Movie :  ఈ వారం థియేటర్స్ లో విడుదలయ్యే మూవీస్ ఏంటీ..?
X

కొన్నాళ్లుగా తెలుగు మూవీస్ సత్తా చాటడంలో విఫలం అవుతున్నాయి. సంక్రాంతి మూవీస్ తర్వాత ఆ స్థాయిలో మెప్పించే మూవీస్ ఏంటీ అంటే ప్రశ్నార్థకంగా ఉండిపోయాయి. బట్ ప్రతి వారం ఐదారు సినిమాలు విడుదలవుతున్నాయి. వీటిలో కొన్నిటికి కొంత వరకూ బానే ఉన్నట్టుగానే కనిపించాయి. బట్ సూపర్ హిట్ అనే టాక్ మాత్రం తెచ్చుకోలేకపోయాయి. ఇక మార్చి నెల ఫస్ట్ వీక్ లో విడుదల కాబోతున్న మూవీస్ ఏంటీ..? వాటి కెపాసిటీ ఏంటీ అనేది చూస్తే.. లాస్ట్ వీక్ విడుదలైన విష్ణు విన్యాసం తర్వాత వారమే మృత్యుంజయ్ తో వస్తున్నాడు శ్రీ విష్ణు. ఈ మూవీ మార్చి 6న విడుదలవుతోంది.

శ్రీ విష్ణు హీరోగా నటించిన మృత్యుంజయ్ కంప్లీట్ గా థ్రిల్లర్ గా ఉంటుందని చెబుతున్నారు. ప్రమోషన్స్ మరీ గతంలో లాగా లేవు. అయితే సుకుమార్ శిష్యుడు డైరెక్టర్ కావడం కొంత ప్లస్ అవుతుందేమో. శ్రీ విష్ణుకు ఈ మూవీలో హీరోయిన్ కూడా ఉండదు అంటున్నారు. మరి ఈ కంప్లీట్ థ్రిల్లర్ తో ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో శ్రీ విష్ణు అనేది చూడాల్సిందే.

వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తూ డైరెక్ట్ చేసిన మూవీ సరస్వతి. ప్రకాష్ రాజ్, ప్రియమణి, కిశోర్ వంటి వాళ్లు కీలక పాత్రలో నటించిన ఈ మూవీ కాన్సెప్ట్ బేస్డ్ గా ఉండబోతోంది అనేలా ఉంది ట్రైలర్. ఇది కూడా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ లాగానే ఉండబోతోంది అనిపిస్తోంది. మరి దర్శకురాలుగా వరలక్ష్మి ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

శివాజీ, లయ కీలక పాత్రల్లో నటించిన మూవీ సంప్రదాయిని సుప్పిని సుద్దపూస. మొదట ఈ మూవీని ఓటిటిలోనే విడుదల చేయాలనుకున్నారు. ఆ నిర్ణయం మార్చుకున్నారు. థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలనుకున్నారు. ఈ మూవీ కోసం గట్టి ప్రమోషన్స్ మాత్రం చేస్తున్నారు. మరి ఈ ప్రమోషన్స్ వల్ల మూవీకి విజయం అందుతుందా లేదా అనేది చూడాలి. వీటితో పాటు శ్రీనాథ్ మాగంటి హీరోగా నటించిన మూవీ మేన్షన్ హౌస్ మల్లేష్ మూవీ విడుదల కాబోతోంది. శ్రీనాథ్ ఇప్పటి వరకు చేసిన మూవీస్ కు భిన్నంగా ఈ కంటెంట్ ఉంటుందేమో అనేలా ఉంది. వీరిటో పాటు సునిల్ కుమార్ రెడ్డి డైరెక్ట్ చేసిన కాక్రోచ్ కూడా అదే రోజు విడుదల కాబోతోంది. ఇవి కాక ఆండ్రియా జెర్మీయా కీలక పాత్రలో నటించిన తమిళ్ మూవీ డబ్బింగ్ గా కాన విడుదలవుతోంది. మిషన్ సి 1000, చెష్మా రాజు, సెల్ఫీ రాణి మూవీస్ కూడా అదే రోజు విడుదలవుతున్నాయి.

ఇవి కాకుండా ప్రభాస్ హీరోగా నటించిన మున్నా మూవీని కూడా అదే రోజున రీ రిలీజ్ చేయబోతున్నారు. వంశీ పైడిపల్లి దర్శకుడుగా పరిచయం అయిన మూవీ ఇది. ఇలియానా హీరోయిన్. ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో కనిపించాడు. అప్పట్లోనే ఈ మూవీకి నెగెటివ్ టాక్ వచ్చింది. మరి ఇప్పుడు ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి. మొత్తంగా ఈ 8 చిత్రాలు ఆడియన్స్ ఏ మేరకు మెప్పిస్తాయో తెలియాల్సి ఉంది.

Tags

Next Story