Getup Srinu : జాఫర్ వర్సెస్ గెటప్ శ్రీను అసలు ఏం జరిగింది

ప్రమోషన్స్ పలు రకములు. ఒకప్పుడు జర్నలిస్ట్ లు అంటే ఒక రకంగా చూసేవాళ్లం. ఇప్పుడు వాళ్లు అన్ని రంగాల్లో కూడా వేలు పెడుతున్నారు. వైవిధ్యం పేరుతో సినిమా ఆడియన్స్ అటెన్షన్ కూడా కొల్లగొడుతున్నారు. లేదంటే టివి షోస్ లో హడావిడీ చేస్తుంటారు. ఇలా.. వారికి వచ్చిన ఫేమ్ ను చాలా రకాలుగా వాడుకుంటున్నారు. ఆ వాడకం పాటు సినిమా ప్రమోషన్స్ లో కూడా కనిపిస్తోంది. ఇది కూడా అలాంటిదే అని మొదటే చాలామందికి డౌట్ వచ్చింది. కానీ కొంతమంది మాత్రం చాలా సీరియస్ గా తీసుకున్నారీ విషయాన్ని అందుకే ఈ మొత్తానికి ఫుల్ స్టాప్ పెట్టేలా చేసిన వీడియో ఈ మూవీకి మాంచి ప్రమోషన్ ను కూడా క్రియేట్ చేసింది. ఇంతకీ విషయం ఏంటీ అంటే..
‘గెటప్ శ్రీను, నాగబాబు కలిసి నటిస్తున్న సిరీస్‌కు ‘మేము కాపులం’ అనే టైటిల్ పెట్టడం... “కులం పేరు తో సినిమాలు ఏంటి? నాకు నచ్చలేదు” అని జాఫర్ చెప్పిన వీడియో వైరల్ అయ్యింది.
అసలు విషయం ఏమిటంటే... 'తెలుగు జీ5' ఓటీటీ నుంచి త్వరలో రాబోతున్న తెలుగు జీ5 ఒరిజినల్ సిరీస్ 'మేము COPలం' టైటిల్ ఖరారు చేశారు. దానిపై మాట్లాడిన సంభాషణ వైరల్ అయ్యింది. ఇప్పుడు అసలు విషయం ఏమిటనేది పూర్తి వీడియోలో వివరించారు’.
సో.. గెటప్ శ్రీను మొదట మాట్లాడిన దానికి గెటప్ వేరే ఉంది. రెండో వీడియోలో అతను పోలీస్ గెటప్ లో కనిపించాడు. అదేంటీ అంటే మేం ‘కాప్ లం’ కదా. అందుకే ఇలాంటి టైటిల్ పెట్టేసుకున్నాం అన్నాడు. అది ముందే చెప్పొచ్చు కదా అని జాఫర్ అడిగితే.. అసలు మీరు చెప్పే టైమ్ ఎక్కడిచ్చారు అంటూ మొత్తం విషయం చెప్పాడు గెటప్ శ్రీను. మొత్తంగా ఇదీ వ్వవహారం. మేం కాప్ లం మూవీకి వచ్చిన మంచి ప్రమోషన్ గా ఈ వీడియో వైరల్ అయిందన్నమాట.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
