Krishnam Raju Daughters: కృష్ణంరాజు ముగ్గురు కూతుళ్లు ఏం చేస్తుంటారో తెలుసా.. !!

Krishnam Raju Daughters: మరో వెండి తెర నటుడు కన్నుమూశారు. రెబల్ స్టార్‌గా సినిమాల్లో తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన నటుడు కృష్ణంరాజు. కరుణ, రౌద్రం పాత్రలకు తగ్గ అభినయం, ఆహార్యం.. ఏ పాత్ర చేసినా ఆ పాత్రకే వన్నె తెచ్చే నటన ఆయన సొంతం. అనారోగ్య సమస్యలతో 83 ఏళ్ల వయసులో ఆయన ఆదివారం (సెప్టెంబర్ 11) మరణించారు.
కుటుంబసభ్యులు, సన్నిహితుల అశ్రునయనాల మధ్య కృష్ణంరాజు అంత్యక్రియలు ముగిశాయి. ఇదిలా ఉంటే ఆయనకు ముగ్గురు ఆడపిల్లలు. అందరికీ పెళ్లి వయసు వచ్చింది. కానీ ఏ ఒక్కరికీ పెళ్లి కాలేదు. ఆఖరికి తమ్ముడి కొడుకు ప్రభాస్ పెళ్లి చూడాలని కూడా కృష్ణం రాజు ఆశ పడ్డారు. కానీ అతడు కూడా ఆయన ఉండగా పెళ్లి చేసుకోలేకపోయాడు. తన ఆఖరి కోరిక తీరకుండానే వెళ్లిపోయారు. ఫ్యామిలీ ఫంక్షన్స్‌లో తప్ప ఏక్కడా బయట కూడా కనిపించని కృష్ణంరాజు ముగ్గురు తనయలు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలని అందరికీ ఆసక్తిగా ఉంటుంది.
పెద్ద అమ్మాయి ప్రసీద లండన్‌లో ఎంబీఏ పూర్తి చేసింది. ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ చిత్రంతో ఆమె నిర్మాతగా మారింది. రెండో అమ్మాయి ప్రకీర్తి హైదరాబాద్‌లోని జేఎన్టీయూలో ఆర్కిటెక్చర్ చదువుతోంది. మూడో అమ్మాయి ప్రదీప్తి సైకాలజీలో డిగ్రీ పూర్తి చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com