Ram Gopal Varma : ఏంటి వర్మా నిజంగా సీరియస్సా..?

రామ్ గోపాల్ వర్మ .. ఒకప్పుడు ఇండియన్ సినిమా లెక్కలు మార్చిన జీనియస్ డైరెక్టర్. తన ఫస్ట్ మూవీతోనే తెలుగు సినిమాను శివకు ముందు శివ తర్వాత అనేలా చేశాడంటే అతని కెపాసిటీ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇక బాలీవుడ్ అంతా కేవలం లావిష్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ కే పరిమితమైన టైమ్ లో సత్య, రంగీలా, కంపెనీ వంటి మూవీస్ తో మొత్తం మార్చేశాడు. అయితే అతని స్టార్డమ్ అంతా కేవలం 2005 వరకు మాత్రమే కొనసాగింది. ఆ తర్వాత అతనేంటో ఇప్పుడు తరానికి తెలిసింది వింటే పాత వారికి బాధనిపిస్తుంది. అర్థంపర్థం లేని సినిమాలతో ఇమేజ్ ను కోల్పోవడమే కాదు.. కొన్నిసార్లు మత్తులో చేసిన పనుల వల్ల వ్యక్తిత్వాన్ని కూడా కోల్పోయాడు. పార్టీల మాయలో పడి ఒక పార్టీకి కొమ్ము కాస్తూ మరో పార్టీని వెండితెర వేదికగా అవహేళన చేశాడు. ఇవన్నీ క్షమించరాని తప్పులే అయినా.. అతను కమ్ బ్యాక్ మూవీ లాంటిది చేస్తే చూడాలని అతన్ని అస్సలు ఇష్టపడని వాళ్లు కూడా కోరుకుంటున్నారు అనేది వాస్తవం.
రీసెంట్ గా సత్య మూవీ టీమ్ తో ఓ రీ యూనియన్ జరిగింది. ఆ తర్వాత వర్మ ఓ ప్రాయశ్చితమైన పోస్ట్ పెట్టాడు. తను ఇన్నాళ్లూ టైమ్ వేస్ట్ చేసుకున్నానని.. పిచ్చి పిచ్చి సినిమాలు చేశానని.. ఇకపై మారతారనని.. మళ్లీ పాత రామ్ గోపాల్ వర్మను చూస్తారని చెప్పాడు. బట్ ఇది కూడా అతని పబ్లిసిటీ స్టంట్స్ లో భాగమే అనుకున్నారు చాలామంది. బట్ అతను మాత్రం ‘సిండికేట్’అనే టైటిల్ తో ఓ సినిమా చేయబోతున్నానని ఆ కథ ఇదే అంటూ ఏకంగా సోషల్ మీడియాలో ఓ పేద్ద పోస్ట్ కూడా పెట్టాడు. అయినా వందశాతం నమ్మలేదు. కానీ ఇప్పుడు చూస్తే ఈ ప్రాజెక్ట్ కోసం ది బెస్ట్ టీమ్ ను సెట్ చేసుకునే పనిలో ఉన్నాడనే వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ చూసి ఏంటి వర్మా సీరియస్సా అంటూ ఆశ్చర్యపోతున్నారు.
యస్.. తన సిండికేట్ మూవీ కోసం తన సర్కార్.. వర్మ అంటే ఇష్టపడే అమితాబ్ బచ్చన్ ను తీసుకుంటున్నాడట. అలాగే ఈ మూవీలో కీలకమైన పాత్రల కోసం తన క్షణక్షణం హీరో వెంకటేష్ తో పాటు వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతిని కూడా సంప్రదించబోతున్నాడు అనే టాక్ వినిపిస్తోంది. సినిమా సంగతి ఎలా ఉన్నా.. అసలు ఈ కాంబోను సెట్ చేస్తే చాలు.. బాక్సాఫీస్ లు షేక్ అయిపోతాయి. ఏదేమైనా వర్మను చివరి క్షణం వరకూ.. అంటే అతని సినిమా రిలీజ్ అయ్యి టాక్ తెలిసే వరకూ నమ్మలేం అనేది కూడా నిజమే. అయితే ఆ అపనమ్మకం అతని ప్రతిభ గురించి కాదు.. కేవలం వ్యక్తిత్వం గురించి మాత్రమే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com