Manhcu Lakshmi: బాహుబలిలో ఆ క్యారెక్టర్.. చేయనందుకు చాలా గర్విస్తున్నా: మంచు లక్ష్మి షాకింగ్ కామెంట్స్

Manhcu Lakshmi: బాహుబలిలో ఆ క్యారెక్టర్.. చేయనందుకు చాలా గర్విస్తున్నా: మంచు లక్ష్మి షాకింగ్ కామెంట్స్
Manhcu Lakshmi: రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.

Manchu Lakshmi: రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. అందులో అన్ని పాత్రలు హైలెట్ అయినా శివగామిగా రమ్యకృష్ణ నటన అద్భుతం. ఆమె తప్ప ఆ పాత్రలో మరెవరినీ ఊహించుకోలేనంతగా ఆమె ఆ పాత్రలో ఒదిగిపోయారు. ఎవరికి రాసి పెట్టి ఉంటే వాళ్లే చేస్తారంటే ఇదేనేమో..

ముందుగా అందాల తార శ్రీదేవిని అనుకున్నారు ఆమె వదులుకున్నారు. ఇక్కడ మంచు లక్ష్మిని సంప్రదిస్తే ఆమె కూడా ప్రభాస్‌కి తల్లిగా చేయాలంటే కాస్త ఇబ్బందిగానే అనిపిస్తుందని ఆమె కూడా రిజక్ట్ చేశారట. దాంతో ఆ ఛాన్స్ రమ్యకృష్ణను వరించింది. ముచ్చటగా మూడో వ్యక్తి రమ్య, వచ్చిన అవకాశానికి వంద కంటే ఎక్కువే న్యాయం చేశారు. శివగామిగా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు.

మంచు లక్ష్మి ఇప్పటికే చాలా సార్లు తనకి వచ్చిన బాహుబలి ఆఫర్ గురించి చెబుతుంటుంది. తాజాగా మరోసారి ఆ ప్రస్తావన తీసుకువచ్చింది. శివగామి పాత్ర చేయనందుకు చాలా గర్వపడుతున్నా అని చెప్పుకొచ్చింది ఇటీవల ఓ ఇంటర్వ్యూలో.

బాహుబలిలో శివగామి పాత్ర వచ్చినప్పుడు తాను రిజెక్ట్ చేసిన విషయం గురించి చెబుతూ.. ఇండియాలో మనం ఒక పాత్ర పోషించిన తర్వాత దానిలోనే ఉండిపోతాం. కానీ నేను మాత్రం ఒకే తరహా పాత్రలకు పరిమితం కావాలనుకోలేదు. బాహుబలి సినిమా అంత పెద్ద హిట్ అయ్యాక నిజానికి నేను చాలా గర్వపడ్డాను.

హమ్మయ్య నేను ఆ సినిమా చేయలేదు అనుకున్నా. అది ఓ స్పెషల్ మూవీ కావచ్చు. కానీ ఆ పాత్రకు నేను కరెక్ట్ కాదనిపించింది. నా జీవితం, నా కెరీర్ దృష్టిలో పెట్టుకునే ఆ నిర్ణయం తీసుకున్నా. అలాగే నా కెరీర్‌లో చేసిన ఐరేంద్రి (అనగనగా ఓ ధీరుడు) లాంటి పాత్ర ఇంకోటి రాలేదు. ఇక మీదట రాదు కూడా అని ఆమె తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story