Ram Pothineni : ఆంధ్రాకింగ్ తాలూకా ట్రైలర్ లో ఏముందీ..?

Ram Pothineni :  ఆంధ్రాకింగ్ తాలూకా ట్రైలర్ లో ఏముందీ..?
X

ఆంధ్రాకింగ్ తాలూకా మూవీ ట్రైలర్ లో విడుదలైంది. మామూలుగా ఈ మూవీపై మంచి అంచనాలున్నాయి. ఆ అంచనాలకు పెంచడంలో ముందు ఉంటున్నాడు రామ్ పోతినేని. ఆంధ్రాకింగ్ తాలూకా టైటిల్ తోనే చాలా వరకు సినిమా ఏంటీ అనేది అంచనా వేశాడు. అంచనా ఏం కాదు.. నిజంగానే ఆంధ్రాకింగ్ తాలూకా అనిపించుకున్నాడు రామ్.

పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో సాగే కథలా అనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక హీరోకు విపరీతమైన అభిమాని ఉంటాడు. అతని సినిమా అంటే అతనికి పిచ్చి ఉంటుంది. మరోవైపు అదే థియేటర్ ఓనర్ అమ్మాయిని ప్రేమిస్తాడు ఆ అభిమాని కుర్రాడు. ప్రేమలో పడటం వరకు బానే ఉంటాడు. అతన్ని అవమానిస్తాడు సదరు థియేటర్ ఓనర్. థియేటర్ అమ్మాయిని ప్రేమిస్తాడు అనేది అతని కోపం. మరి ఆ తర్వాత అతను థియేటర్ ను దాటుకుని ఏ మేరకు ప్రయత్నిస్తాడు.. అందరూ అతన్ని సినిమా పిచ్చివాడు అనే విషయాన్ని దాటుకుని ఏం చేశాడు అనేది సినిమా చూడాల్సిందే అనేలా ఉంది. మరోవైపు సదరు హీరోగారు తన అభిమాని కోసం ఏం చేశాడు అనేది తెరపైనే చూడాల్సిన విషయం.

ఓ రకంగా రామ్ కు ఇది టైలర్ మేడ్ లాంటి పాత్రే. ఆ క్యారెక్టర్ ను ఓన్ చేసుకున్న విధానం ఆకట్టుకుంది. ముఖ్యంగా సినిమా పిచ్చివాడు అనగానే ఆఖర్లో అంతా మారిపోతారు అనేలా లేకుండా.. అతను సినిమా పిచ్చివాడులానే చివరి వరకు కనిపించడం సూపర్ గా ఉంది. మధ్యలో ఫైట్లు, యాక్షన్ సీక్వెన్స్ లు, చదువుకోవడం, ప్రేమాయణం .. వెరసి ఎలా చూసినా సినిమా పిచ్చోడు అనిపించేలా ఉండటం మాత్రం బాగా ఆకట్టుకుంది.

మైత్రీ మూవీ మేకర్స్ ను నిర్మిస్తున్న మూవీ ఇది. ఉపేంద్ర హీరో పాత్రలో కనిపించబోతున్నాడు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా కనిపించబోతోంది. మహేష్ బాబు పి దర్శకత్వం చేయబోతున్నాడు. ఓ రకంగా అతని డైరెక్షన్ హైలెట్ కాబోతోందీ మూవీలో అనిపించేలా ఉంది. మొత్తంగా ఈ నెల 27న విడుదల కాబోతోన్న ఈ మూవీతో రామ్ ఓ బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాడు అనిపించేలా ఉన్నాడు.

Tags

Next Story