Shekhar Kammula : శేఖర్ కమ్ముల తర్వాతేంటీ..?

Shekhar Kammula :  శేఖర్ కమ్ముల తర్వాతేంటీ..?
X

కెరీర్ లో 10 సినిమాలు మాత్రమే చేశాడు దర్శకుడు శేఖర్ కమ్ముల. బట్ అతను ప్రారంభించింది మాత్రం 2000 యేడాదిలో. అంటే 25యేళ్లలో ఇప్పటి వరకు కేవలం 10 సినిమాలు మాత్రమే రూపొందించాడు. మరి ఇన్నేళ్లుగా అతను తక్కువ సినిమాలు చేయడానికి కారణం ఏంటీ అంటే.. ది బెస్ట్ క్వాలిటీ. యస్.. 10 సినిమాలే చేశాడు.. కానీ 50 సినిమాల స్థాయిలో కీర్తి సంపాదించాడు. ఒక్కో సినిమాతో మూడు, నాలుగు, ఐదేళ్లు టైమ్ తీసుకుంటాడు. బట్ బెస్ట్ అవుట్ పుట్ మాత్రమే ఇస్తున్నాడు. అయితే లవ్ స్టోరీ తర్వాత చేసి కుబేర మాత్రమే అనుకున్నంత స్థాయిలో మాత్రం విజయం సాధించలేదు అనేది నిజం. అతను అనుకున్న స్థాయిలో కుబేర మాత్రం కంటెంట్ పరంగా బెస్ట్ అనిపించుకోలేకపోలేదు.

కరోనా టైమ్ లో చేసిన లవ్ స్టోరీ మాత్రం బాగా ఆకట్టుకున్నాడు. మళ్లీ నాలుగేళ్ల టైమ్ తీసుకున్నాడు. ఈ యేడాదిలో మాత్రం కుబేర విడుదలైంది. కుబేర టైమ్ కోసం చాలా టైమ్ తీసుకున్నాడు. ధనుష్, నాగార్జున, రష్మిక మందన్నా వంటి స్టార్ కాస్టింగ్ తీసుకుని మెప్పించాడు. ఇక ఆ తర్వాతేంటీ అనే ప్రశ్నకు మాత్రం ఇప్పటి వరకు సమాధానం చెప్పలేకపోతున్నాడు శేఖర్ కమ్ముల. మళ్లీ అతన్నుంచి ఓ మూడు నాలుగేళ్లు టైమ్ తీసుకుంటుందేమో కానీ.. ఇంత గ్యాప్ లో ఎలాంటి మూవీ చేయబోతున్నాడో అనేది మాత్రం ఫజిల్ గా మారింది.

శేఖర్ కమ్ముల మూవీస్ లో సోషల్ ఇష్యూస్ కూడా కొంత కనిపిస్తోంది. గత రెండు సినిమాల్లో అవి కాస్త ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ తర్వాతి చిత్రాల్లో మాత్రం తనదైన రెగ్యులర్ మూవీ చేస్తాడా అనేది తేలాల్సి ఉంది. అతని తర్వాతి సినిమా ఏంటీ అనే ప్రశ్నకు ఇప్పటి వరకు సరైన సమాధానం మాత్రం తెలియడం లేదు. ఏదేమైనా శేఖర్ కమ్ముల సినిమాల్లో వేగం కనిపించడం లేదు. కానీ ఇప్పటి ట్రెండ్ లో మాత్రం ఆ వేగం కూడా కొంత అవసరమా. లేదంటే మొత్తంగా ఆలస్యం అయితే అంతే సంగతులవుతుందేమో.

Tags

Next Story