The Girlfriend Movie : ఈ ఫ్రైడే మూవీస్ పరిస్థితి ఏంటీ..?

ఈ ఫ్రైడే మూవీస్ లిస్ట్ పెద్దగా ఉంది ఈ వారం. వచ్చిన మూవీస్ అన్ని ఆకట్టుకున్నాయి అనే విషయాన్ని కూడా చూడాలి. దీంతో ఈ వారం వచ్చిన సినిమాల గురించి మాట్లాడాల్సి ఉంటుంది. ప్రధానంగా చూస్తే టాప్ హీరోయిన్ గా వెలుగుతున్న బ్యూటీ రష్మిక మందన్నా నటించిన ద గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్పాల్సి ఉంది. దీక్షిత్ శెట్టి హీరోగా నటించిన ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే పరిస్థితి చెబుతుందా అంటే కష్టమే అని చెప్పాలి. కంటెంట్ పరంగా చూస్తే బలంగా ఉంది. రష్మిక నటన ది బెస్ట్ అనిపిస్తుంది. ఆమె నటనలో భిన్నమైన కోణాలు కనిపిస్తున్నాయి. చాలా పరిపక్వమైన నటనతో చూపిస్తుంది. కాకపోతే ఈ ఆడియన్స్ కు ఏ మేరకు ఆకట్టుకుంటుంది అనేది చెప్పాల్సి ఉంది.
సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం జటాధర. ఈ మూవీ కూడా శుక్రవారం విడుదలైంది. కానీ సినిమా మాత్రం హాహాకారాలు పెట్టించాల్సినట్టుగా ఉంది మూవీ. అస్సలే మాత్రం ఆకట్టుకోలేదు. కథ, కథనం మాత్రం మాత్రం అవుట్ డేటెడ్ అనిపించుకుంది.సుధీర్ బాబు నటనలో ఏ మాత్రం కొత్తదనం లేదు. సోనాక్షి సిన్హా వీలైనంత ఇరిటేట్ గా ఉన్నాయి. ఓ రకంగా ఈ సినిమా వేస్ట్ అనిపించుకుంది.
తిరువీర్ హీరోగా నటించిన ప్రీ వెడ్డింగ్ షో మూవీ కూడా విడుదలైంది. ఈ మూవీ ఆడియన్స్ కు ముందే షోస్ వేశారు. ఓ రకంగా ద గర్ల్ ఫ్రెండ్ మూవీ కంటే ముందే వేశారు. అందుకు తగ్గ ఫలితం వచ్చినట్టే కనిపిస్తుంది. ఈ మూవీకి సూపర్ హిట్ టాక్ వచ్చింది. మంచి కథనం ఆకట్టుకుంటోంది. కామెడీగా మెప్పిస్తోంది. చూస్తున్నంత సేపు హాయిగా నవ్వుకునే చిత్రంలాగానే మెప్పించింది. కాకపోతే ప్రమోషన్స్ విషయంలో మాత్రం కాస్త ఇబ్బంది పెడుతోంది మూవీ. ప్రమోషన్స్ విషయంలో ఇంకాస్త మెప్పిస్తే బావుంటుంది అనిపిస్తుంది.
ఇక రెండు డబ్బింగ్ సినిమాల గురించి అసలే మాట్లాడటం లేదు. తమిళ్ నుంచి విడుదలైన ఆర్యన్ మూవీ పెద్దగా ఆకట్టుకోలేదు. హీరో గురించి కూడా పట్టించుకోవడం లేదు. ఇక మళయాలం నుంచి మూవీ డైస్ ఇరే అనే మూవీ విషయంలోనూ అంతే. ఈ చిత్రాన్ని తెలుగులో పట్టించుకోవడం లేదు. ఈ రెండు డబ్బింగ్ సినిమాల గురించి పట్టించుకోవడం లేదు అనే చెప్పాలి.
మొత్తంగా ద గర్ల్ ఫ్రెండ్ మూవీ బావుంది అనే వచ్చింది. ప్రీ వెడ్డింగ్ షో మాత్రం సూపర్ గా ఉందనే టాక్ ఉన్నా.. ప్రమోషన్స్ విషయంలో మాత్రం వెనకబడే ఉందనే చెప్పాలి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

