Naga Chaitanya : తెనాలి రామకృష్ణ నాగ చైతన్యకు ఒరిగేదేంటీ..?

తెలుగు సాహిత్యం తెలిసిన ఎవరికైనా తెనాలి రామకృష్ణ తెలియకుండా ఉండదు. వికటకవిగా శ్రీ కృష్ణ దేవరాయాల ఆస్థాన కవుల్లో ఒకడుగా ఎంతటి క్లిష్టమైన సమస్యనైనా ఇట్టే పరిష్కరించే మేధావిగా వివిధ కోణాలున్న వ్యక్తిగా కనిపిస్తాడు తెనాలి రామకృష్ణ. కొన్ని కావ్యాలల్లో తెనాలి రామలింగడుగానూ ప్రసిద్ధి చెందాడు. ఇదే పాత్రతో అక్కినేని నాగేశ్వరరావు ఓ సినిమా చేశారు. అప్పుడు రాయలవారిగా ఎన్టీఆర్ నటించారు. కానీ కథంతా ఏఎన్నార్ పైనే ఎక్కువగా సాగుతుంది. అలాంటి సినిమాను మళ్లీ నాగ చైతన్యతో చేస్తా అని తండేల్ సక్సెస్ మీట్ లో ప్రకటించాడు దర్శకుడు చందు మొండేటి. ఇది వర్కవుట్ అవుతుందా లేదా అనేది పక్కన పెడితే అసలు నాగ చైతన్యకు ఆ పాత్ర చేయడం సాధ్యమా.. సాధ్యమే అయితే ఈ పాత్రతో అతనికి వచ్చే ఇమేజ్ ఎలా ఉంటుంది అనేది చూస్తే..
తెనాలి రామకృష్ణ పాత్రకు ఎలాంటి హీరోయిజం ఉండదు. ఆ పాత్రలో ఓ హాస్యం, ఛమత్కారం దాగి ఉంటాయి. ఇలాంటి పాత్రలు చేయాలంటే అద్భుతమైన కామెడీ టైమింగ్ ఉండాలి. పైగా 15వ శతాబ్ధం నాటి కథ కాబట్టి శుద్ధ తెలుగు భాషపై పట్టు ఉండాలి. పదాల్లో స్పష్టత, ఉచ్ఛారణలో తెలుగుదనం కనిపించాలి. ఈ అంశాలేవీ నాగ చైతన్యలో లేవు అని అతన్ని ఇన్నేళ్లుగా చూస్తున్న ఏ ప్రేక్షకుడైనా ఇట్టే చెప్పేస్తాడు. తండేల్ వచ్చే వరకు అతనిలో ఇంత మించి నటుడు ఉన్నాడని తెలియదు కదా.. అలా తెనాలి రామకృష్ణ చేస్తే కదా ఆయన చేయగలడా లేదా తెలిసేది అనుకుంటారేమో.. అలా అనుకున్నా ఈ పాత్ర ద్వారా నాగ చైతన్యకు ఉన్న లవర్ బాయ్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. అలాగే మాస్ లో రాణించాలనుకుంటున్న డ్రీమ్ దెబ్బయిపోతుంది.
నిజానికి అప్పట్లో నాగేశ్వరరావు గారు ఎన్టీఆర్ వచ్చిన తర్వాత ఆయన పర్సనాలిటీతో కంపేర్ చేసుకుని తన మైనస్ లను దాచేసి కేవలం ప్లస్ పాయింట్స్ ఆధారంగానే కథలు ఎంచుకున్నారు. ఆ కారణంగానే ఎన్టీఆర్ కు సమస్థాయి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. లేదూ తనూ ఆయన్లానే రాయల వారి వేషం, శ్రీ కృష్ణుడు, రాముడు అంటూ ఆ వేషాలూ వేసినా.. లేదా మాస్ హీరోగా రాణించాలని ప్రయత్నించినా ఆయన కెరీర్ ఎప్పుడో ఆగిపోయేది. బట్ నాగ చైతన్యకు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. తండేల్ లాంటిదే కాకపోయినా ఇప్పుడున్న స్టార్స్ రేస్ లో మరో మాంచి మాస్ సబ్జెక్ట్ తో రావొచ్చు. లేదూ అదే పౌరాణికాల నుంచి ఏదో ఒక స్ట్రాంగ్ రోల్ ను ఇన్సిస్పిరేషన్ గా తీసుకుని మాస్ మూవీతోనూ రావొచ్చు. కాదూ కూడదూ.. నేను తెనాలి రామకృష్ణ పాత్రనే కొత్తగా చూపిస్తాను అని చందు మొండేటి ఒప్పించినా.. అందులో ఏ మాత్రం తేడా జరిగినా ప్రేక్షకులు ఒప్పుకోరు. ఎందుకంటే అది ఫిక్షనల్ పాత్ర కాదు. కాకపోతే కాసిన్ని అతిశయోక్తులు ఉంటాయోమో కానీ.. పాత్రను వక్రీకరిస్తే ఆడియన్స్ అంత ఈజీగా వదలరు. సో.. మంచి హిట్ తో ఉన్నప్పుడు ఇలాంటి ‘సాధారణ’ పాత్రలు చేయడం కంటే సాహసం శాయరా డింభకా లాంటి స్ట్రాంగ్ రోల్స్ సెలెక్ట్ చేసుకుంటనే మంచిదేమో..
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com