వాట్సాప్ బేబీ.. ఎవరిని పెళ్లి చేసుకుంటావ్..
ఈ మధ్యకాలంలో వచ్చిన చిన్న సినిమా బేబీ, పెద్ద హిట్ అయింది. నిర్మాత దర్శకులకు ఊహించని విజయాన్ని అందించింది. వెబ్ సిరీస్ చేసుకునే వైష్ణవీ చైతన్య హీరోయిన్ గా, ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ హీరోలుగా నటించిన రొమాంటిక్ డ్రామా బేబీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది.
కమర్షియల్ గానూ సక్సెస్ సాధించి ఏకంగా రూ.90 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. ఇక ఓటీటీ ఆహాలో కూడా దుమ్ము రేపుతోంది. ఎక్కువ మంది చూసిన సినిమాగా రికార్డు సృష్టించింది. ఈ క్రమంలో ఆహా వాట్సాప్ బేబీ పేరుతో వైష్ణవీ చైతన్యతో ఇంటరాక్ట్ అయ్యింది. ఈ సందర్భంగా అడిగిన పలు ప్రశ్నలకు వైష్ణవి తనదైన రీతిలో సమాధానాలు ఇచ్చింది.
అవును బేబీ.. నిజ జీవితంలో ఆనంద్, విరాజ్ లాంటి అబ్బాయిలు తారసపడితే ఎవరిని చేసుకుంటావ్ అని అడిగితే ఇద్దరినీ కాదు అని సమాధానం చెప్పింది. అయితే ఒక్కొక్కరిలో ఒక్కో క్వాలిటీ ఉందని అది తనకు నచ్చుతుందని చెప్పుకొచ్చింది. అలాగే సినిమాలో బేబీ చేసింది కరెక్టేనా అంటే ఇలా చేయకూడదు, అలా చేయకూడదు అంటూ మనకి మనం పరిమితులు పెట్టుకోలేం కదా, ఆ పాత్ర తీరును బట్టి ఆ సమయంలో ఏం అనిపిస్తే అది చేసింది అని వైష్ణవి సమాధానం చెప్పింది. మరి సినిమాలో నీ క్యారెక్టర్ నచ్చిందా అని అడగ్గా.. చాలా నచ్చింది అని నవ్వుతూ సమాధానం చెప్పింది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ ప్రోగ్రాం మీరు చూసేయండి.. ఆహాలో స్ట్రీమ్ అవుతోంది. బేబీ హావభావాలు యువ హృదయాలను గిలిగింతలు పెడుతోంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com