Amitabh Bachchan: బిగ్ బికి ప్రపోజ్ చేసిన శ్వేతా మీనన్.. ఆనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ..

Amitabh Bachchan: బిగ్ బికి ప్రపోజ్ చేసిన శ్వేతా మీనన్.. ఆనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ..
X
Amitabh Bachchan: 10 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు తాను అమితాబ్ బచ్చన్‌కు ప్రపోజ్ చేసిన విషయం పంచుకుంది.

Amitabh Bachchan @ 80: ప్రముఖ మలయాళ నటి శ్వేతా మీనన్ 80 ఏళ్లు నిండిన బిగ్ బికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ కొన్ని మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకుంది. 10 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు తాను అమితాబ్ బచ్చన్‌కు ప్రపోజ్ చేసిన విషయం పంచుకుంది.


ప్రస్తుతం ముంబైలో ఉంటున్న నటి మీడియాతో మాట్లాడుతూ.. తన చిన్నతనంలో అలహాబాద్‌లో జరిగిన ఘటన గుర్తు చేసుకుంది. "మా నాన్న ఎయిర్‌ఫోర్స్‌ అధికారి. ఇందిరాగాంధీ చితాభస్మాన్ని నిమజ్జనం చేసేందుకు రాజీవ్‌గాంధీ, అమితాబ్ బచ్చన్‌లు అలహాబాద్‌కు వస్తున్నారని ఒకరోజు ఇంట్లో చెప్పారు. అప్పుడు నేను బచ్చన్‌ను కలవాలనుకుంటున్నానని చెప్పగా, మా నాన్న గట్టిగా తిరస్కరించారు".


"సందర్భం వచ్చినప్పుడు కలవొచ్చు. కానీ దానికి ఇప్పుడు సమయం కాదు అన్నారు. కానీ నేను ఒప్పుకోలేదు అని ఆ రోజును గుర్తుచేసుకుంది. మేము ఎయిర్ ఫోర్స్ ప్రాంతంలో ఉన్నాము. పళ్ళు తోముకోకుండా, నేను బయటకు పరిగెత్తి, వేదిక వద్దకు చేరుకున్నాను. అక్కడ పూర్తి నిశ్శబ్దం ఉంది. ఫంక్షన్ జరుగుతోంది. నేను బచ్చన్‌ దగ్గరకు చేరుకుని, 'నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కాబట్టి నన్ను పెళ్లి చేసుకోండి' అని చెప్పాను."


"అప్పుడు నేను మా నాన్న వైపు చూశాను, అతను కళ్లెర్రజేశారు. కోపంగా ఉన్నారు. ఒక్క క్షణంలో మరొక అధికారి వచ్చి అక్కడి నుంచి నన్ను తీసుకెళ్లారు" అని మీనన్ తాను చిన్నప్పుడు చేసిన చిలిపి అల్లరిని గుర్తు చేసుకున్నారు. కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. 1994లో మిస్ ఇండియా పోటీలో గెలిచిన తర్వాత, కన్వెన్షన్ ప్రకారం, విజేత దానిని తదుపరి విజేతకు అందజేయడానికి మరుసటి సంవత్సరం తిరిగి వస్తారు.


"ఈ సంఘటన ముంబైలో జరిగింది. స్టేజీకి వెళ్లే మెట్లు చాలా నిటారుగా ఉన్నాయి. నేను నిలబడి ఉండగా, నా పక్కన నిలబడినది బచ్చన్ అని నేను గ్రహించాను. నేను ట్రాన్స్‌లోకి వెళ్లిపోయాను ఆ క్రమంలో నేను పడిపోయాను. అతను వచ్చి నేను లేవడానికి సహాయం చేసారు. అది నాకు చాలా గొప్ప క్షణం" అని మీనన్ నవ్వుతూ బిగ్ బి పట్ల తనకున్న గౌరవాన్ని వివరించింది. మీనన్ బాలీవుడ్‌తో సహా పలు చిత్ర పరిశ్రమలలో పనిచేశారు. ప్రస్తుతం మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌కు సభ్యురాలిగా ఉన్నారు.

Tags

Next Story