Naga Chaitanya Marriage Date : చైతు, శోభిత .. పెళ్లెప్పుడంటే?

నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల ఎంగెజ్ మెంట్ పూర్తయింది.. ఇప్పుడు అందరి దృష్టి పెళ్లి తేదీపైనే పడింది. అలాగే వివాహం కూడా సింపుల్ గా జరుగుతుందా? అంరంగ వైభవంగా నిర్వహిస్తారా? అన్న అంశం తెరపైకి వస్తోంది. వివాహం ఎప్పుడు జరిగినా రాజస్తాన్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ జరుగుతుందని విశ్వసనీయ సమాచారం. రెండు కుటుంబాలు చర్చించుకుని పెళ్లి తేదీపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నిశ్చితార్ధం తర్వాత వివాహానికి ఎక్కువ గ్యాప్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. దీంతో డిసెంబర్ లో జరుగుతుందని కొందరు అంటున్నారు. మార్చిలోనే ఉంటుందని మరికొందరు చెబుతున్నారు. శ్రావణ మాసం, కార్తీక మాసంలో కూడా వివాహాలు జరుగుతాయి. కానీ బలమైన ముహూర్తాలు లేవనే వాదన బలంగానే వినిపిస్తోంది. ప్రస్తుతం నాగచైతన్య హీరోగా 'తండేల్' చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. చైతన్య కెరీర్ లో ఇదే తొలి పాన్ ఇండియా సినిమా కావడం విశేషం
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com