Pooja Meri Jaan : పూజా మేరీ జాన్ రిలీజ్ ఎప్పుడంటే?

హలో నందన్... మరాఠీ సినిమాతో తెరంగేట్రం చేసిన బ్యూటీ మృణాల్ ఠాకూర్. 2014లో సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ భామ.. సీతారామం సినిమాతో టాలీవుడ్ లో కి ఎంట్రీ ఇచ్చింది. స్టార్ గా ముద్ర వేసుకున్నాక మృణాల్ కు బోలెడు అవకాశాలు వస్తున్నాయి. కెరీర్ ఆరంభంలో ఏదైనా పాత్ర కోసం ముందు ఎంచుకుని, తర్వాత పక్కన పెడితే చాలా బాధ పడతారు ఆర్టిస్టులు. ‘పూజా మేరీ జాన్' అనే మూవీ విషయంలో తనకూ అలాగే జరిగిందంటోంది మృణాల్. ఇది మృణాల్ కెరీర్లో లాంగ్ డిలేయ్డ్ మూవీ. ఈ సినిమా పనులు చాలా ఏళ్ల కిందట మొదలయ్యాయి. రెండేళ్ల కిందటే దీని చిత్రీకరణ పూర్తయింది. ఈ ఏడాది చివర్లో 'పూజా మేరీ జాన్' రిలీజ్ కావచ్చని చెప్పిన మృణాల్ .. ఇందులో ప్రధాన పాత్ర కోసం తాను నిర్మాతలతో గొడవ పడ్డ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పిందామె. తనను ఈ సినిమా కోసం సంప్రదించారని, చాలాసార్లు ఆడిషన్ జరిగిందని అంటోంది. తన కెరీర్లో అన్నిసార్లు ఆడిషన్ జరిగిన సినిమా ఇంకోటి లేదన్నారు. ఆ పాత్రతో నేను ఎమోషనల్ గా బాగా కనెక్టయ్యాను. తన పాత్రకు మరొకరిని ఎంచుకున్నారని తర్వాత తెలిసి నిర్మాతలతో గొడవపడి సొంతం చేసుకున్నానని గుర్తు చేసుకుంది. ఈ ఏడాదే రిలీజవుతుందని అనుకుంటున్నానంటోంది మృణాల్ .
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com