Harihara Veera Mallu : హరిహర ట్రైలర్ రిలీజ్ ఎప్పుడు..?

Harihara Veera Mallu :  హరిహర ట్రైలర్ రిలీజ్ ఎప్పుడు..?
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు అన్ని హర్డిల్స్ ను దాటుకుని ఫైనల్ గా జూన్ 12న విడుదల కాబోతోంది. దాదాపు ఐదేళ్లకు పైగా ఈ ప్రాజెక్ట్ కోసం వేచి చూశాడు నిర్మాత ఏఎమ్ రత్నం. ఇంత ఆలస్యాన్ని భరించలేక దర్శకుడు క్రిష్ తప్పుకున్నాడు. తర్వాత ఏఎమ్ రత్నం తనయుడు జ్యోతికృష్ణ (గోపీచంద్ ఆక్సీజన్ మూవీకి ఇతనే దర్శకుడు) మెగాఫోన్ పట్టుకున్నాడు. ఔరంగజేబ్ కాలం నాటి కథ, పవన్ రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపించబోతున్నాడు అనేది అందరికీ ఇంట్రెస్టింగ్ గా మారింది. పైగా ఈ మూవీలో యాక్షన్ సీక్వెన్స్ లు వింటేజ్ పవన్ ను గుర్తుకు తెస్తాయి అనే టాక్ ఉంది. ఆయన మార్షల్ ఆర్ట్స్ లో కొత్త కోణాన్ని చూపించబోతున్నాయంటున్నారు.

పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్. బాబీ డియోల్, నర్గీస్ ఫక్రీ, నోరా ఫతేహీ ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ఎలా చూసినా పవన్ కు ఓ స్పెషల్ మూవీగా కనిపిస్తోన్న ఈ మూవీ రిలీజ్ టైమ్ దగ్గరకు వచ్చేసింది. కేవలం రెండు వారాల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అందుకే ట్రైలర్ ఎప్పుడు అనే ప్రశ్నలు పెరుగుతున్నాయి. ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ వస్తాడా అనే డిస్కషన్స్ కూడా జరుగుతున్నాయి. ఇప్పటికైతే సాంగ్ లాంచ్ లాంటి ఈవెంట్స్ కు నిధి అగర్వాల్ మాత్రమే కనిపిస్తోంది. తనతో పాటు దర్శకుడు, నిర్మాతలు సినిమా గురించిన విశేషాలు చెబుతున్నారు. అయితే ట్రైలర్ వస్తే వీరు మరిన్ని వివరాలు చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ప్రమోషన్స్ లో రెగ్యులర్ గా కాక కొత్తగా చేస్తోన్న టైమ్ ఇది. ఎంత పవన్ కళ్యాణ్ మూవీ అయినా వీళ్లూ కొత్త తరహాలో ప్రమోషన్స్ చేయాల్సి ఉంటుంది. బట్ చూస్తుంటే ఆ దిశగా వీరి ఆలోచనలు ఉన్నట్టేం కనిపించడం లేదు. ఇవన్నీ ఎలా ఉన్నా.. అసలు ఈ ట్రైలర్ ఎప్పుడు వస్తుందా అని ఈగర్ గా చూస్తున్నారు ఫ్యాన్స్. మరి అదెప్పుడో కాస్త చెబుతారా రత్నం గారూ..?

Tags

Next Story