Dhanush మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్నావా రాయన్..

హీరో ధనుష్ కు దేశవ్యాప్తంగా మంచి పాపులారిటీ ఉంది. మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ గా తిరుగులేని పేరుంది. రీసెంట్ గా సార్ మూవీతో డైరెక్ట్ గా తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చాడు. తెలుగుతో పాటు హిందీలోనూ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఇక్కడ ధనుష్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. అలాంటి హీరో 50వ సినిమా అంటే ఎలా ఉండాలి..? పైగా ఈ చిత్రాన్ని తనే డైరెక్ట్ చేసుకున్నాడు. యస్.. ఇదంతా ధనుష్ 50వ సినిమా ‘రాయన్’ గురించే. సందీప్ కిషన్, సెల్వ రాఘవన్ వంటి తెలుగు వాళ్లకు బాగా తెలిసిన ఆర్టిస్టులు కూడా ఉంటే హైప్ కూడా పెంచుకోవాలి. బట్ ఈ సినిమాకు సంబంధించి అలాంటివేం కనిపించడం లేదు.
రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ నెల 26న విడుదల చేస్తున్నట్టు గతంలోనే ప్రకటించారు. రిలీజ్ కు వారం మాత్రమే ఉంది. అయినా అస్సలెలాంటి బజ్ కనిపించడం లేదీ సినిమాకు. తమిళ్ లో ఏమో కానీ తెలుగులో అయితే పోటీ కూడా లేదు. ఇలాంటి టైమ్ కు క్యాష్ చేసుకోవాలంటే మంచి ప్రమోషన్స్ తో పాటు ఓ మూడు నాలుగు ఈవెంట్స్ ప్లాన్ చేసుకుంటే తప్ప సినిమాకు హైప్ రాదు. కానీ వీళ్లు అలాంటివేం ప్లాన్ చేసుకున్నట్టు కనిపించడం లేదు. అందుకే సినిమా విడుదలవుతున్న విషయం కూడా చాలామందికి తెలియడం లేదు. ఏ స్టార్ హీరోకైనా వేరే భాషలో తమ సినిమాలను డబ్ చేస్తున్నప్పుడు ఇలాంటి అవకాశాలు ఎప్పుడో కానీ రావు. కానీ రాయన్ టీమ్ ఒక మంచి ఛాన్స్ ను మిస్ చేసుకుంటున్నట్టుగా కనిపిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com